Omicron: ఒమిక్రాన్‌ను లైట్ తీసుకుంటున్నవాళ్లకు హై అలర్ట్.. అందులో HIV మూలాలు ఉన్నాయట..!
ఒమిక్రాన్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. హడలెత్తిస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ ఎంతలా భయపడెతుందంటే.. అది అనూహ్య వేగంతో..
కరోనాను లైట్ తీసుకుంటున్నవాళ్లకు హై అలర్ట్.. అందులో HIV మూలాలు ఉన్నాయట..! ఈ విషయాన్ని సౌతాఫ్రికా పరిశోధనల్లో ప్రాథమిక నిర్ధారించారు. సౌతాఫ్రికాలో HIV బాధితుల సంఖ్య ఎక్కువే. అక్కడి ఓ మహిళ నుంచి ఒమిక్రాన్ సంక్రమించి.. విస్తరించినట్టు గుర్తించారు. ఒమిక్రాన్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. హడలెత్తిస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ ఎంతలా భయపడెతుందంటే.. అది అనూహ్య వేగంతో వ్యాపించి, టీకా తీసుకున్న వారిలోనూ ఇన్‌ఫెక్షన్ కలిగించేంత. దీనికి ఇంత శక్తి ఎలా వచ్చింది..? దక్షిణాఫ్రికాలో.. ఉన్నా, లేనట్టే అన్నట్టు బలహీనపడిన కరోనా వైరస్ ఉన్నఫళంగా ఒమిక్రాన్‌గా ఎలా పట్టేసిందనేదానిపై పెద్ద పరిశోధన జరుగుతోంది. అదేంటో తేల్చేందుకు ప్రయత్నిస్తున్న దక్షిణాఫ్రికా పరిశోధకులు కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ మూలాల్లో హెచ్‌ఐవీ ఉంది అని ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పరిశోధకులు.
అదేంటి అని అనకుంటున్నవారికి..
ఐక్యరాజ్యసమితి దేశాల హెచ్‌ఐవీ, ఎయిడ్స్ సంయుక్త నియంత్రణ కార్యక్రమం ‘యూఎన్‌ఎయిడ్స్’ గత ఏడాది ఓ నివేదికను విడుదల చేశాయి. ఇందులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికాలో 18-45 ఏళ్ల వయసున్న ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్‌ఐవీకి గురయ్యారని.. ప్రపంచ హెచ్‌ఐవీ సెంటర్‌గా దక్షిణాఫ్రికా మారిందనే భయంకరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. ఈ వైరస్ సోకినవారిలో 30శాతం పైగా మంది అసలు యాంటీరిట్రోవైరల్ డ్రగ్స్‌ని తీసుకోవడమే లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
హెచ్‌ఐవీ సోకినా ఎలాంటి మందులు వాడనివారి రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనపడి, ఇతరత్రా వ్యాధులకు కేంద్రంగా మారుతున్నారు. సరిగ్గా ఇలాంటి మహిళే కరోనా బారిన పడిందని పేర్కొన్నారు. ఆమె శరీరంలోని హెచ్‌ఐవీ వైరస్ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా అవతరించి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన డా.కెంప్ టీమ్ సభ్యులు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. హెచ్‌ఐవీ వైరస్ తిష్ఠవేసిన శరీరంలో కరోనా విజృంభించడానికి చాలా అనువైన పరిస్థితులుంటాయన్నారు.
ఇవి కూడా చదవండి: Reservation: వారికి కూడా అవకాశం.. రిజర్వేషన్.. అంతేకాదు ఇక అక్కడ పోలీసులుగా..
Lok Sabha: సభలో మీ ఎంపీ ఏం చేస్తున్నారో చూడాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..
Honey for Skin: పట్టులాంటి చర్మం కోసం తేనెను ఉపయోగించండి.. ఎలా వాడాలో తెలుసుకోండి..