AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant: ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు.. కెన్యా నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్..

Andhra Pradesh Omicron Variant: దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన

Omicron Variant: ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు.. కెన్యా నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్..
Omicron Variant
Shaik Madar Saheb
|

Updated on: Dec 22, 2021 | 12:34 PM

Share

Andhra Pradesh Omicron Variant: దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నమోదైంది. కెన్యా నుంచి వచ్చిన మహిళకు పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. కెన్యా నుంచి వచ్చిన మహిళ.. చెన్నై విమానాశ్రయం నుంచి తిరుపతికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ నెల 12 ఆ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు శాంపిళ్లను జీనోమ్ సీక్వేన్సింగ్‌కు పంపించగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

214 కి చేరిన ఒమిక్రాన్ కేసులు..  కాగా.. దేశంలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ విజృంభిస్తోంది. భారత్‌లో ఇప్పటివరకు 214 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. 15 రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దేశంలో కొత్త వేరియంట్‌ కారణంగా ఇప్పటివరకు ఒక్కరు కూడా చనిపోలేదు. అయితే.. దేశంలో ఇప్పటివరకు అత్యధికంగా ఢిల్లీలో 57 కేసులు వెలుగులోకి రాగా.. మహారాష్ట్రలో 54, తెలంగాణ 24, కర్నాటక 19, రాజస్థాన్ 18, గుజరాత్ 14, ఏపీలో 2 కేసులు ఉన్నాయి. కాగా.. ఇప్పటివరకు 90 మంది బాధితులు కొత్త వేరియంట్ నుంచి కోలుకున్నారు.

Also Read:

అర్ధరాత్రి ఉలిక్కిపడిన బిల్డింగ్ వాసులు.. ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి.. ఆ తర్వాత..

Crime News: ఇంట్లోకి వెళ్లకుండానే చనిపోయాడు.. లిఫ్ట్‌లో చిక్కుకొని బాలుడి దుర్మరణం.. అసలేమైందంటే..?

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!