Andhra Pradesh: ఏపీని వణికిస్తున్న శీతల గాలులు.. వృద్దులు, చిన్నారులు జాగ్రత్త అంటున్న నిపుణులు..
Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ తక్కువగా నమోదవుతున్నాయి.. రోజు రోజుకీ చలి తీవ్రత పెరుగుతూ ప్రజలను వణికించేస్తోంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు గాలులతో కోస్తా, రాయలసీమ..
Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ తక్కువగా నమోదవుతున్నాయి.. రోజు రోజుకీ చలి తీవ్రత పెరుగుతూ ప్రజలను వణికించేస్తోంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు గాలులతో కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజలు వణుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మన్యంలో శీతలగాలులు సాయంత్రం నుంచే వీస్తున్నాయి. తెల్లవారుజామున మంచు వర్షం కురుస్తోంది. దీంతో రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు విజయనగరం గుంటూరు, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోనూ చలి ప్రభావం అధికంగానే ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచే చలిగాలులు మొదలవుతున్నాయి. ఉదయం 10 గంటలైనా కొన్ని చోట్ల చలి తీవ్రత తగ్గడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
అయితే దీనికి కారణం ఉత్తర భారతంలో చలి తీవ్రత అని.. అక్కడ నుంచి వీస్తున్న గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా కోస్తా రాయలసీమ ప్రాంతాలపై తూర్పుగాలుల ప్రభావం ఉంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర తక్కువగా నమోదు కావచ్చు. రానున్న రెండు రోజుల్లో గాలులు దిశా మార్చుకునే అవకాశం ఉండాలి.. అప్పుడు చలి తీవ్రత కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read: నేడు 8వ పాశురం.. కన్నయ్య అనుగ్రహం కోసం అతనికి కంటే ముందుగా పూజకు చేరుకోవాలంటున్న గోదా..