APSRTC: సంక్రాంతికి రైళ్లు, బస్సులు ఫుల్‌..ఆ తేదీల్లో ఏపీఆర్టీసీ స్పెషల్‌ బస్సుల ఏర్పాటు..

APSRTC Sankranti Special Buses: తెలుగువారికి అతి పెద్ద పండగ.. సంక్రాంతి.. దీంతో సంక్రాంతి వస్తుంటే.. నగర ప్రజలు పల్లె బాట పడతారు. తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండగను..

APSRTC: సంక్రాంతికి రైళ్లు, బస్సులు ఫుల్‌..ఆ తేదీల్లో ఏపీఆర్టీసీ స్పెషల్‌ బస్సుల ఏర్పాటు..
Ap Sankranti Special Buses
Follow us
Surya Kala

|

Updated on: Dec 23, 2021 | 9:22 AM

APSRTC Sankranti Special Buses: తెలుగువారికి అతి పెద్ద పండగ.. సంక్రాంతి.. దీంతో సంక్రాంతి వస్తుంటే.. నగర ప్రజలు పల్లె బాట పడతారు. తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండగను సంతోషంగా గడపాలని ఇంటికి వెల్దామనుకుంటారు. అటువంటి వారికి ప్రయాణం చేయడంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా రైళ్లు, బస్సుల్లో రద్దీ నెలకొంటుంది. ఇప్పటికే జనవరి 7నుంచి జనవరి 14వరకూ ముందస్తు రిజర్వేషన్లతో రైళ్లలో, బస్సుల్లో బెర్తులు, సీట్లు ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ వైపు వెళ్లే రైళ్లకు, బస్సులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ట్రైన్స్ లో అయితే కనీసం కాలు పెట్టె పరిస్థితి కూడా ఉండదు. వెయిటింగ్ లిస్ట్ కూడా భారీగా ఉంది. దీంతో దక్షిణ మధ్య రైల్వేశాఖ స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వెళ్లే గోదావరి జిల్లాల బస్సులతో పాటు, ఉత్తరాంధ్రవైపు వెళ్లే బస్సుల రిజర్వేషన్ ఇప్పటికే పూర్తి అయింది. జనవరి 8 నుంచి 14వ తేదీల మధ్య విశాఖపట్నం మీదుగా వెళ్లే విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే ఆర్టీసీ బస్సుల రిజర్వేషన్ ఇప్పటికే పూర్తి అయింది.  ఇప్పటికే రెగ్యులర్‌ బస్సుల్లో సీట్లు ఫుల్‌ అవుతుండడంతో.. ఇక స్పెషల్‌ సర్వీసులకు రిజర్వేషన్ కు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్పెషల్‌ బస్సులు

కరోనా తగ్గుముఖం పడుతుందంటూ కరోనా నిబంధనలు అనుసరిస్తూ.. ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణం చేసేలా ఏపీఆర్టీసీ సంక్రాంతికి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తోంది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కృష్ణా రీజియన్‌ నుంచి 1,266 ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌కు 362, విశాఖపట్నానికి 390, రాజమండ్రికి  360,చెన్నైకి 20, బెంగళూరుకు 14, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 120 బస్సులను నడపనున్నారు.

రైళ్లు రద్దీ:  రోజూ విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా నిత్యం 85 ట్రైన్స్ కు పైగా ప్రయాణిస్తున్నాయి. అయితే రత్నాచల్‌,  సింహాద్రి,  జన్మభూమి రైళ్లలో రిజర్వేషన్ కు ఆకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం కొన్ని సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలిన అన్ని ట్రైన్స్ అడ్వాన్స్ బుకింగ్ తో బుక్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో ముందస్తు రిజర్వేషన్లతో ట్రైన్స్ ఫుల్ అయ్యాయి.

Also Read:  తమిళనాడులో ఒమిక్రాన్‌ టెన్షన్.. విదేశాల నుంచి వచ్చినవారిలో 82మంది అనుమానితులు..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?