Ramatheertham Temple: అశోక్ గజపతి రాజు పై నమోదైన కేసు.. విధులకు ఆటంకం కలిగించారంటూ ఆలయ ఈవో ఫిర్యాదు..
రామతీర్ధం ఘటన మరింత ముదురుతుంది. మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పై కేసు నమోదైంది. రామతీర్థం ఆలయ నిర్మాణ శంకుస్థాపన సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అశోక్ గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు..

రామతీర్ధం ఘటన మరింత ముదురుతుంది. మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పై కేసు నమోదైంది. రామతీర్థం ఆలయ నిర్మాణ శంకుస్థాపన సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అశోక్ గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు ఈవో డివివి ప్రసాద్. శంకుస్థాపన ఏర్పాట్లు వద్ద అనుచితంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈవో ప్రసాద్. అశోక్ గజపతి రాజుతో పాటు మరికొందరిపై 473, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఆలయ అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతికి ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని.. కావాలనే ఆయన రాద్ధాంతం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈవో ప్రసాద్.
మాన్సస్ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న అశోకగజపతి రాజే ఈ ఆలయ కమిటీకి కూడా చైర్మన్. అయితే ఆనవాయితీ ఫాలో అవ్వడంలేదని.. సంప్రదాయాలను పక్కనపెట్టారని ఆశోక్‌గజపతి ఆగ్రహించారు. అక్కడున్న బోర్డును కింద పడేసే ప్రయత్నం చేశారు. నిన్న అశోక్ గజపతి రాజు తీరును తీవ్రంగా తప్పుపట్టారు మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్.
ఇవి కూడా చదవండి: Pralay Missile: చైనా గుండెల్లో వణుకుపుట్టిస్తున్న ప్రళయ్.. భారత క్షిపణి పరీక్ష విజయవంతం..
