Viral Video: గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయాడు.. 30 అడుగుల ఎత్తులో వేలాడాడు.. నెట్టింట్లో వైరల్ వీడియో..
చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గాలిపటాలు ఎగరవేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సంక్రాంతి వేడుకల్లో కనుమ రోజు గాలిపటాల పండగను ఎంతో వేడుకగా జరుపుకొంటారు.
చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గాలిపటాలు ఎగరవేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సంక్రాంతి వేడుకల్లో కనుమ రోజు గాలిపటాల పండగను ఎంతో వేడుకగా జరుపుకొంటారు. అయితే శ్రీలంకకు చెందిన ఒక వ్యక్తి సరదాగా తన స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరవేశాడు. కానీ గాలిపటంతో పాటు అనుహ్యంగా అతను కూడా గాల్లోకి ఎగిరిపోయాడు. తోటి స్నేహితులు తాడును వదిలివేయమని చెప్పినా భయంతో వినలేదు. దీంతో అలా గాల్లోకి సుమారు భూమికి 30 అడుగుల ఎత్తుకు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. శ్రీలంకలో ‘తై పొంగల్’ అనే పండగను వేడుకగా జరుపుకొంటారు. ఇందులో భాగంగా గాలిపటాలు ఎగర వేసే పోటీలు నిర్వహిస్తారు. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఈ పొటీల్లో పాల్గొంటారు. తమ సృజనాత్మకతకు పదును పెడుతూ రకరకాల గాలిపటాలు తయారుచేసి ప్రదర్శిస్తారు.
ఈనేపథ్యంలో ఎప్పటిలాగే శ్రీలంకలో జాఫ్నాలోని పాయింట్ పెడ్రోలో ‘ కైట్ ఫ్లయింగ్ గేమ్’ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా చాలామంది రకరకాల గాలిపటాలను ఎగరవేశారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తి తన ఆరుగురు స్నేహితులతో కలిసి ఒక జనపనార తాళ్లతో కూడిన పెద్ద గాలిపటాన్ని తయారుచేశాడు. ఆతర్వాత ‘కైట్ ఫ్లయింగ్ గేమ్’ పాల్గొనడానికి వచ్చాడు. పోటీల్లో భాగంగా గాలిపటాన్ని ఎగరవేశారు. అయితే ఆ సమయంలో బృందంలోని ఆరుగురు సభ్యులు గాలిపటం తాడును నెమ్మదిగా వదిలేస్తే అతను మాత్రం అలాగే పట్టుకుని నిల్చున్నాడు. దీంతో గాలిపటంతో సహా అతను గాల్లోకి వెళ్లిపోయాడు. స్నేహితులు తాడుని వదిలేయ్ అంటున్నా భయంతో అతను తాడును గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అలాగే 30 అడుగుల ఎత్తుకు వెళ్లిపోయాడు. కొన్ని నిమిషాల పాటు అలాగే గాల్లోనే వేలాడాడు. అయితే కొద్ది సేపయ్యాక గాలిపటం కొద్దిగా భూమి సమీపానికి వచ్చింది. అప్పుడు తాడు వదిలేయడంతో నేలపై పడిపోయాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తికి కొద్దిపాటి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ‘ఇది కైటా? పారాచూటా? ‘ అని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
Dramatic video shows a youth swept into the air with a kite in Jaffna area. The youth was reportedly suffered minor injuries.pic.twitter.com/W0NKrYnTe6 #Kiteman #Kite #LKA #Jaffna #SriLanka
— Sri Lanka Tweet ?? ? (@SriLankaTweet) December 21, 2021
Also Read:
Viral Photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్
Viral Video: నీటి సంపులో పడిపోయిన పిల్లి.. కాపాడేందుకు కోతి తాపత్రయం చూడండి
Viral: గజరాజుకు కోపం వచ్చింది.. చిరుత గజగజ వణికిపోయింది.. ఏకంగా గంట పాటు