Viral Video: నీటి సంపులో పడిపోయిన పిల్లి.. కాపాడేందుకు కోతి తాపత్రయం చూడండి
మానవత్వం అనేది మాటల్లో తప్ప చేతల్లో కనిపించని రోజులివి... కానీ జంతువులు మాత్రం అలా కాదు. జాతి భేదం లేకుండా తోటి జంతువు ఏదైనా ఆపదలో ఉంటే ఆదుకుంటున్నాయి.
మానవత్వం అనేది మాటల్లో తప్ప చేతల్లో కనిపించని రోజులివి… కానీ జంతువులు మాత్రం అలా కాదు. జాతి భేదం లేకుండా తోటి జంతువు ఏదైనా ఆపదలో ఉంటే ఆదుకుంటున్నాయి. తమ మధ్య సమైక్యతను చాటుతున్నాయి. ఇందుకు ఉదాహరణే ఈ సంఘటన. ఒక పిల్లి అనుకోకుండా బావిలో పడిపోయింది. అది చూసిన ఓ కోతి దానిని కాపాడటానికి విశ్వప్రయత్నం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు ఎంతగానో లైక్ చేస్తున్నారు.
ఈ వీడియోలో ఓ పిల్లి… నీటి సంపులో పడిపోయింది. అయితే ఆ సంపులో నీళ్లు లేవు, లోతు కూడా తక్కువే. అయినా పాపం ఆ పిల్లి అందులోంచి బయటకు రాలేకపోయింది. అది గమనించిన ఓ కోతి “పాపం” అనుకుంది. ఎలాగైనా దాన్ని బయటకు తేవాలి అనుకుంది. లోపలికి దూకింది. పిల్లిని పట్టుకొని పైకి ఎత్తేద్దాం అనుకుంది. కుదరలేదు. పోనీ తాను పైన కూర్చుని ఒక కాలిని పిల్లికి అందించి పైకి లాగుదామనుకుంది… పాపం అదీ సధ్యం కాలేదు.. సంపులో ఉన్న బురదలో కర్రలాంటిదేదైనా దొరకుతుందేమోనని వెతికింది. దొరకలేదు. ఇదంతా చేస్తూనే మధ్య మధ్యలో ఆ పిల్లికి ముద్దులు పెడుతూ.. ఏం పర్వాలేదు.. బయపడకు అంటూ ధైర్యం చెప్పింది. మళ్లీ బావి పైకి వచ్చి కూర్చుని ఎవరైనా కనిపిస్తారేమో అని చూసింది. అదృష్టవశాత్తు ఇదంతా గమనించిన ఒక యువతి అక్కడికి వచ్చింది. కోతి సంపులో ఉన్న పిల్లిని చూపించి కాపాడమన్నట్టుగా ఆ యువతి వైపు చూసింది. అప్పుడు ఆ యువతి లోపలికి దిగి పిల్లిని పైకి తీసి కోతికి అందించింది. దాంతో ఊపిరి పీల్చుకున్న కోతి.. ఆ పిల్లికి అంటిన బుదరను తుడుస్తూ.. దానిని ఓదార్చింది. ఈ వీడియోని IFS ఆఫీసర్ సుశాంత్ నందా డిసెంబర్ 20న తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. “మన సమస్యల ప్రపంచంలో ఈ కోతిలా అవ్వండి” అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోని వీక్షిస్తున్న వేలమంది నెటిజన్లు ఆ వానరం మనసు చూసి ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనుషులకు లేని మానవత్వం, దయాగుణం కోతిలో ఉందని మెచ్చుకుంటున్నారు.
Be this monkey in our troubled world? Credit in the video pic.twitter.com/hGsdDcicjd
— Susanta Nanda IFS (@susantananda3) December 20, 2021
Also Read: Viral: గజరాజుకు కోపం వచ్చింది.. చిరుత గజగజ వణికిపోయింది.. ఏకంగా గంట పాటు
Andhra Pradesh: మద్యం ధరలు తగ్గాయన్న ఆనందంలో మితిమీరి తాగాడు.. చివరకు