AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తెగిన పారాచూట్‌ తాడు.. సముద్రంలో పడిపోయిన మహిళలు.. తర్వాత ఏం జరిగిందంటే..

సాహసాలు, అడ్వెంచర్లు చేయాలని చాలామందికి ఉంటుంది. వాటిని ప్రయత్నించడంలో తప్పులేదు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాలు ప్రమాదంలో పడతాయి

Viral Video: తెగిన పారాచూట్‌ తాడు.. సముద్రంలో పడిపోయిన మహిళలు.. తర్వాత ఏం జరిగిందంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 22, 2021 | 5:17 PM

సాహసాలు, అడ్వెంచర్లు చేయాలని చాలామందికి ఉంటుంది. వాటిని ప్రయత్నించడంలో తప్పులేదు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అలాంటి సంఘటనే ఒకటి ముంబయిలోని అలీభాగ్‌లో జరిగింది. ముంబయికి చెందిన ఇద్దరు మహిళలు విహారయాత్రకోసం అలీభాగ్ వచ్చారు. అక్కడి బీచ్‌ సమీపంలో సరదాగా పారా సెయిలింగ్ చేద్దామనుకున్నారు. ఇందుకోసం స్థానికంగా ఉండే ఓ పవర్‌బోటు నిర్వాహకులతో మాట్లాడారు. వారి సహాయంతో పారాచూట్‌ కట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయారు. అయితే వారు పైకి వెళ్లిన కొద్ది సేపటికే బోటు నుంచి పారాచూట్‌కు బిగించిన తాడు తెగిపోయింది. దీంతో వారు సముద్రంలో పడిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో వారు 100 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు పవర్‌ బోట్‌ నిర్వాహకులు తెలిపారు.

అయితే మహిళలు లైఫ్‌ జాకెట్లు ధరించడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన బోటు సిబ్బంది సత్వరమే స్పందించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు సుమారు 4.5 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఆ మహిళలకు ఇంకా భూమ్మీద నూకలున్నాయి. అందుకే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు’ అని ఒకరు స్పందించగా, ‘ఇలాంటి అడ్వెంచర్లు చేసేటప్పుడు పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకోవాలి’ అని మరొకరు సూచించారు.

కాగా కొన్ని రోజుల క్రితం గుజరాత్‌కు చెందిన నవ దంపతులు హనీమూన్‌లో భాగంగా ఇలాగే పారాచూట్‌ సహాయంతో ఆకాశంలో విహరిద్దామనుకున్నారు. అయితే ఆకాశంలోకి ఎగిరిపోయిన కొద్ది సేపటికే తాడు తెగిపోవడంతో సముద్రంలో పడిపోయారు. బోట్‌ సిబ్బంది సత్వరమే స్పందించడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.

సముద్రంలో పడిపోయిన మహిళల వీడియో:

Also read: Nostradamus predictions: 2022లో నిప్పుల వాన తప్పదా ?? లైవ్ వీడియో

Viral video: రణ్‌బీర్‌ పాటకు స్టెప్పులేసిన వరుడు.. పెళ్లి కూతురు రియాక్షన్‌ చూసి..

Mahanandi Temple: మహానంది క్షేత్రంలో అద్భుతం.. పరవశించి పోతున్న భక్తులు.. వీడియో మీకోసం..