Viral video: రణ్‌బీర్‌ పాటకు స్టెప్పులేసిన వరుడు.. పెళ్లి కూతురు రియాక్షన్‌ చూసి..

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టం. అందుకే అందరూ తమ వివాహ వేడుకను గ్రాండ్‌గా జరుపుకోవాలనుకుంటారు

Viral video: రణ్‌బీర్‌ పాటకు స్టెప్పులేసిన వరుడు.. పెళ్లి కూతురు రియాక్షన్‌ చూసి..
Follow us

|

Updated on: Dec 22, 2021 | 4:45 PM

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టం. అందుకే అందరూ తమ వివాహ వేడుకను గ్రాండ్‌గా జరుపుకోవాలనుకుంటారు. ప్రి వెడ్డింగ్‌ షూట్‌, మెహెందీ, సంగీత్‌, విందులు, వినోదాలు.. ఇలా ఎన్నో కార్యక్రమాలకు పెళ్లి ప్రణాళికల్లో చోటు కల్పి్స్తారు. ముఖ్యంగా ఇప్పుడు సంగీత్‌లకు పెళ్లిలో ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది. ఇందులో భాగంగా వధూవరులతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు సరదాగా ఆడిపాడుతున్నారు. వివిధ సినిమా పాటలకు తమదైన శైలిలో స్టెప్పులు వేసి ఆకట్టుకుంటున్నారు. ఇటీవల పెళ్లి సంగీత్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో మరొకటి నెట్టింట్లో బాగా హల్‌చల్‌ చేస్తోంది.

కరణ్‌ జోహర్‌ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్‌’. అనుష్కా శర్మ, ఐశ్వర్యారాయ్‌ హీరోయిన్లుగా నటించారు. ఇందులోని ‘క్యూటీపీ’ అనే పాట ఎంతో ఫేమస్‌. పెళ్లి వేడుక నేపథ్యంలో సాగే ఈ పాటను ఇప్పటికే చాలామంది రీక్రియేట్‌ చేశారు. తాజాగా భరత్‌ ధింగ్రా అనే వరుడు కూడా ఈ పాటకు స్టెప్పులేశాడు. పెళ్లికి వచ్చిన అతిథులతో కలిసి అద్భుతంగా కాలు కదిపాడు. అయితే వరుడి డ్యాన్స పక్కన పెడితే.. కాబోయే భర్తను ఉత్సాహ పరుస్తూ వధువు ఇచ్చిన రియాక్షన్‌ అక్కడి అతిథులతో పాటు మనల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. వీడియోలో ఇదే హైలెట్‌. ప్రస్తుతం ఈ క్యూట్‌ దంపతుల పెళ్లి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు నవ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ క్యూట్‌ పెళ్లి వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also read:

Mahanandi Temple: మహానంది క్షేత్రంలో అద్భతం.. పరవశించి పోతున్న భక్తులు.. వీడియో మీకోసం..

Plane Crash: పారా గ్లైడర్‌ను ఢీకొని కుప్పకూలిన విమానం.. ఇద్దరు మృతి..

Pushpa: బన్నీకి కంగ్రాట్స్‌ చెప్పిన అక్షయ్‌ కుమార్‌.. త్వరలోనే పుష్ప సినిమా చూస్తానని ట్వీట్‌..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ