Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: బన్నీకి కంగ్రాట్స్‌ చెప్పిన అక్షయ్‌ కుమార్‌.. త్వరలోనే పుష్ప సినిమా చూస్తానని ట్వీట్‌..

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఇటీవల విడుదలైన మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ దక్షిణాదితోపాటు హిందీలోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది.

Pushpa: బన్నీకి కంగ్రాట్స్‌ చెప్పిన అక్షయ్‌ కుమార్‌.. త్వరలోనే పుష్ప సినిమా చూస్తానని ట్వీట్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 22, 2021 | 3:30 PM

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఇటీవల విడుదలైన మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ దక్షిణాదితోపాటు హిందీలోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా బన్నీ నటనకు, సుకుమార్‌ టేకింగ్‌కు అభిమానులే కాదు సెలబ్రిటీలు ఫిదా అవుతున్నారు. సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజయ్‌దేవర్‌కొండ, నితిన్‌, సందీప్‌రెడ్డి వంగా వంటి సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ‘పుష్ప’ యూనిట్‌కు అభినందనలు తెలపగా.. తాజాగా బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ఈ సినిమాపై స్పందించాడు. త్వరలోనే ఈ బన్నీ సినిమాను చూస్తానని ట్విట్టర్‌ వేదికగా తెలిపాడు.

‘అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు. ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాకు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. మన భారతీయ సినిమా ఇండస్ట్రీకి మరో భారీ విజయం దక్కింది. త్వరలోనే ఈ సినిమాను చూస్తాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు అక్షయ్‌. అంతకుముందు మరో బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ కూడా బన్నీ నటనను మెచ్చుకుంటూ ‘పుష్ప..ఒక ఎపిక్‌’ అంటూ పోస్ట్‌ పెట్టారు. కాగా ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిగా స్పెషల్ సాంగ్ లో సమంత సందడి చేసింది. అనసూయ, సునీల్, ఫాహద్ ఫాజిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

Also Read:

Sandeep Reddy: పుష్ప సినిమాను వీక్షించిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. బన్నీ గురించి ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే..

Unstoppable with NBK: బాలకృష్ణ అన్‏స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ సందడి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Vijayawada: ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల తనిఖీలు.. కృష్ణా జిల్లాలో 15 థియేటర్లు సీజ్‌..