AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: రాధేశ్యామ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హోస్ట్‌గా ఆ కుర్ర హీరో.. స్టేజ్‌పై నవ్వుల వర్షం ఖాయం..

Radhe Shyam: యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ప్రభాస్‌ రాధేశ్యామ్‌ సినిమా విడుదల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. సాహో తర్వాత వస్తోన్న చిత్రం కావడం.. అందులోనూ పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై..

Radhe Shyam: రాధేశ్యామ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హోస్ట్‌గా ఆ కుర్ర హీరో.. స్టేజ్‌పై నవ్వుల వర్షం ఖాయం..
Narender Vaitla
|

Updated on: Dec 22, 2021 | 4:12 PM

Share

Radhe Shyam: యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ ప్రభాస్‌ రాధేశ్యామ్‌ సినిమా విడుదల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. సాహో తర్వాత వస్తోన్న చిత్రం కావడం.. అందులోనూ పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై ఎక్కడాలేని అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు అనుగుణంగానే చిత్రయూనిట్ కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచేసింది. రోజుకో పాటను విడుదల చేస్తూ ఆడియన్స్‌ అటెన్షన్‌ను డ్రా చేస్తోంది. ఈ క్రమంలోనే రేపు (గురువారం) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను అత్యంత అట్టహాసంగా నిర్వహించడానికి సిద్ధమైంది. రామోజీ ఫిలిమ్‌ సిటీలో భారీ ఎత్తున ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే పలు భాషలకు చెందిన అభిమానుల చేతుల మీదుగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయించనున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాధేశ్యామ్‌ ప్రీరిలీజ్‌ కార్యక్రమానికి యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టి వ్యహరించనున్నాడని సమాచారం. తనదైన హ్యూమర్‌తో జాతి రత్నాలు చిత్రంతో ప్రేక్షకులను కడుబుప్ప నవ్వించిన నవీన్ పోలిశెట్టి ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తుండడంతో స్టేజ్‌పై నవ్వుల వర్షం కురవడం ఖాయమంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి నవీన్‌ ఈవెంట్‌ను ఏ రేంజ్‌లో ఆసక్తికరంగా మారుస్తాడో చూడాలి.

Naveen Polishetty

ఇదిలా ఉంటే రాధేశ్యామ్‌ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్యారిస్‌ నేపథ్యంలో సాగే రాధేశ్యామ్‌ చిత్రానికి జిల్‌ ఫేమ్‌ రాదాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో ప్రభాస్‌కు జోడిగా పూజా హేగ్డే నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి హాలీవుడ్‌ చిత్రం గ్లాడియేటర్‌కు యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ పనిచేయడంతో రాధే శ్యామ్‌పై మరింత ఆసక్తి పెరిగింది.

Also Read: Shocking Incident: మహిళతో పోలీసు అసభ్యకర ప్రవర్తన.. మూత్ర విసర్జన చేస్తూ ఏం చేశాడంటే..

Gujarat panchayat polls: ఇంట్లో 12 ఓట్లు ఉంటే ఒక్కటి కూడా పడకపాయే.. విషయం తెలిసిన అభ్యర్థి ఏం చేశాడంటే..!

Watch Video: ‘గబ్బర్’ డైలాగ్‌కు శిఖర్ ధావన్ యాక్షన్.. వైరలవుతోన్న వీడియో