Watch Video: ‘గబ్బర్’ డైలాగ్‌కు శిఖర్ ధావన్ యాక్షన్.. వైరలవుతోన్న వీడియో

Shikhar Dhawan: పేలవ ఫామ్ కారణంగా ధావన్ ప్రస్తుతం టీమ్ ఇండియాలో చోటు కోల్పోయాడు. భారత టెస్టు జట్టులో అతనికి చోటు దక్కలేదు. అందువల్ల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఆడడంలేదు.

Watch Video: 'గబ్బర్' డైలాగ్‌కు శిఖర్ ధావన్ యాక్షన్.. వైరలవుతోన్న వీడియో
Shikhar Dhawan Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Dec 22, 2021 | 11:13 AM

Trending Video: టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నాడు. అందులో అతను షోలే చిత్రం నుంచి ఒక డైలాగ్‌పై నటించాడు. ఈ వీడియోలో ‘ఎంత మంది పురుషులు ఉన్నారు’ అనే క్యాప్షన్ రాస్తూ వీడియోను షేర్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు లక్షన్నర మందికిపైగా ఈ వీడియోను చూశారు. దీనికి ముందు కూడా ధావన్ సోషల్ మీడియాలో చాలా ఆసక్తికరమైన వీడియోలను పంచుకున్నాడు.

పేలవ ఫామ్ కారణంగా ధావన్ ప్రస్తుతం టీమ్ ఇండియాలో చోటు కోల్పోయాడు. భారత టెస్టు జట్టులో అతనికి చోటు దక్కలేదు. అందువల్ల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఆడడంలేదు. అయితే, వన్డేల్లో అతని పునరాగమనాన్ని ఆశించే ఛాన్స్ ఉంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత్ జట్టును ఇంకా ప్రకటించలేదు.

శిఖర్ ధావన్ వన్డే, టెస్టు ఫార్మాట్‌లలో మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో పాటు టీ20 మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాడు. ధావన్ 34 టెస్టుల్లో 2315 పరుగులు చేశాడు. దీంతో పాటు 145 వన్డేల్లో 6105 పరుగులు చేశాడు. అతను జులై 2021లో శ్రీలంకతో చివరి వన్డే మ్యాచ్, సెప్టెంబర్ 2018లో ఇంగ్లాండ్‌తో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ధావన్ వన్డే ఇన్నింగ్స్‌ను పరిశీలిస్తే, అతను గత 10 మ్యాచ్‌ల్లో 5 అర్ధ సెంచరీలు సాధించాడు. 2021 జులైలో శ్రీలంకపై ధావన్ 86 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అంతకుముందు మార్చి 2021లో, అతను పూణె వన్డేలో ఇంగ్లాండ్‌పై 98 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ దిగ్గజ బ్యాట్స్‌మన్ జూన్ 2019లో ఆస్ట్రేలియాపై తన చివరి వన్డే సెంచరీని సాధించాడు. ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అతను 117 పరుగులు చేశాడు.

Also Read: ఆ వివాదాన్ని సున్నితంగా డీల్ చేయాల్సింది.. అనవసరంగా రాద్ధాంతం చేశారు: గంగూలీపై మాజీ సెలక్టర్ కీలక వ్యాఖ్యలు

Watch Video: 200 టెస్ట్ మ్యాచ్‌ల కెరీర్.. ఒకే ఒక్కసారి ఇలా ఔట్.. ఆ భారత బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా?