Watch Video: 200 టెస్ట్ మ్యాచ్‌ల కెరీర్.. ఒకే ఒక్కసారి ఇలా ఔట్.. ఆ భారత బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా?
Cricket Memories: 20 ఏళ్ల క్రితం భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ తొలిసారిగా, చివరిసారిగా స్టంపౌట్ అయ్యాడు. తన సుధీర్ఘ కెరీర్‌లో ఇలా పెవిలియన్ చేరడం కేవలం ఒక్కసారికే పరిమితమైంది.
Sachin Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ ఆఫ్ క్రికెట్‌గా పిలవబడే సచిన్ టెండూల్కర్ అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. వీటితోపాటే తన క్రికెట్ కెరీర్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు కూడా నిలిచాడు. అయితే తన 200 టెస్టు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే సచిన్ స్టంపౌట్‌గా వెనుదిరిగడం విశేషం. 20 ఏళ్ల క్రితం ఇదే రోజున తొలిసారిగా, చివరిసారిగా స్టంపింగ్ ద్వారా తన వికెట్ సచిన్ కోల్పోయాడు.
2001లో ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనలో ఉంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒకటి భారత్‌కు అనుకూలంగా మారగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. బెంగళూరు వేదికగా మూడో టెస్టు జరుగుతోంది. భారత బౌలర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 336 పరుగులకు కట్టడి చేశారు. దీనికి ప్రతిగా ఇంగ్లిష్ బౌలర్లు కూడా ఒకరి తర్వాత ఒకరు భారత బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చడం ప్రారంభించారు. మ్యాచ్ మూడో రోజు 90 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ క్రీజులో ఉన్నాడు. ఇన్నింగ్స్ 73వ ఓవర్‌ను యాష్లే గైల్స్ బౌలింగ్ చేస్తున్నాడు. తన ఐదో బంతికి సచిన్ ముందుకు వెళ్లి షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా, బంతి బ్యాట్ మీదుగా వెళ్లి వికెట్ కీపర్ జేమ్స్ ఫోస్టర్ చేతుల్లోకి పడింది. వేగంగా వెంటనే స్టంపౌట్ చేసి సచిన్‌కు పెవిలియన్ దారి చూపించాడు.
వర్షం ప్రభావంతో జరిగిన ఈ టెస్టు డ్రా కావడంతో సిరీస్‌ను భారత్ 1-0తో చేజిక్కించుకుంది. సచిన్ టెండూల్కర్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు.
మాస్టర్ బ్లాస్టర్ సూపర్ ఇన్నింగ్స్.. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 200 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 53.78 సగటుతో 15,921 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో 51 సెంచరీలు సాధించాడు. సచిన్ రికార్డులకు చేరుకునేందుకు బ్యాట్స్‌మెన్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ, సచిన్ రాసిన రికార్డుల దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
Sachin Tendulkar Got out Stumped Only Once In His Test Career #OnThisDay 21-12-2001 against England & Bowling of Ashley Giles.@sachin_rt Scored 90 In this innings pic.twitter.com/FE5EHjJWnA
— Zohaib (Cricket King) ? (@Zohaib1981) December 21, 2021
Also Read: 83 Movie: 6 నెలలు.. రోజుకు 4 గంటలు.. కపిల్ దేవ్‌లా రణవీర్ సింగ్ ఎలా మారాడంటే?