Sandeep Reddy: పుష్ప సినిమాను వీక్షించిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. బన్నీ గురించి ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'పుష్ప'. రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌

Sandeep Reddy: పుష్ప సినిమాను వీక్షించిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. బన్నీ గురించి ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 21, 2021 | 9:55 PM

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనసూయ, మంగళం శ్రీను, ఫాహద్‌ ఫాజిల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.173 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసి కరోనా రెండో ఉద్ధృతి తర్వాత అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా రికార్డుల కెక్కింది. ఇక సినిమాలో బన్నీ అద్భుత నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. విజయ్‌ దేవర్‌కొండ, నితిన్‌ లాంటి ప్రముఖులు సినిమాను వీక్షించి బన్నీ ‘వన్‌ మెన్‌ షో’ అంటూ ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తాజాగా ‘అర్జున్‌రెడ్డి’ ఫేం సందీప్‌ రెడ్డి వంగా ‘పుష్ప’ సినిమాను వీక్షించారు. అనంతరం తన అభిప్రాయాలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

సోనిక్‌ మిస్సైల్‌ కన్నా తక్కువేమీ కాదు.. ‘సినిమాలో అల్లు అర్జున్‌ పెర్ఫార్మెన్స్ హైపర్ సోనిక్ మిస్సైల్ కన్నా తక్కువేమీ కాదు. అందరూ ‘పుష్ప’ సినిమాను చూసి బన్నీ నటనకు స్డాండింగ్ ఒవేషన్ ఇవ్వండి. అతడింకా ఇలాంటి ఎన్నో ఒవేషన్లు అందుకోవడానికి అర్హుడు. బన్నీ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన. సుకుమార్‌ సార్‌..మాస్టర్‌ పీస్‌ లాంటి సినిమాను తెరకెక్కించారు. దేవీ గారు మీ పాటలు, బీజీఎం సూపర్బ్‌. రష్మిక గ్రేట్‌ వర్క్‌. చిత్రబృందానికి మొత్తం శుభాకాంక్షలు ‘ అంటూ వరుసగా ట్వీట్ల పెట్టాడు సందీప్‌ వంగా. కాగా ‘అర్జున్‌ రెడ్డి’ ని హిందీలో ‘కబీర్‌ సింగ్’గా తీసి మరో హిట్‌ అందుకున్నాడీ యంగ్‌ డైరెక్టర్‌. ప్రస్తుతం రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ పట్టాలెక్కనుంది.

Also Read:

Viral Photo: తల్లి ఒడిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.!

Bigg Boss 5 Telugu Shanmukh: సిరితో కనెక్ట్ అవ్వడం వల్లే రన్నరప్‏ అయ్యాను.. షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్..

Bheemla Nayak: సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న భీమ్లా నాయక్.. పవన్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?