Bigg Boss 5 Telugu Shanmukh: సిరితో కనెక్ట్ అవ్వడం వల్లే రన్నరప్‏ అయ్యాను.. షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్..

షణ్ముఖ్ జస్వంత్.. సాఫ్ట్‏వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‏తో ఫుల్ ఫాలోయింగ్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వెబ్ సిరీస్ సూర్య కూడా

Bigg Boss 5 Telugu Shanmukh: సిరితో కనెక్ట్ అవ్వడం వల్లే రన్నరప్‏ అయ్యాను.. షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్..
Shanmukh
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Dec 21, 2021 | 9:47 PM

షణ్ముఖ్ జస్వంత్.. సాఫ్ట్‏వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‏తో ఫుల్ ఫాలోయింగ్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వెబ్ సిరీస్ సూర్య కూడా సూపర్ హిట్ కావడంతో షణ్ముఖ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక అదే క్రేజ్‏తో బిగ్‏బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చాడు షణ్ముఖ్. ఆరంభంలో గేమ్ పై సరిగ్గా ఫోకస్ పెట్టని షన్నూ.. ఆ తర్వాత నాగార్జున పచ్చిమిర్చి తినిపించడంతో తన ఆటతీరులో చేంజ్ చేసుకుని స్ట్రాంగ్ కంటెస్టెంట్‏గా మారాడు. అయితే ముందు నుంచి పాజిటివ్ ఓపెనియన్ తెచ్చుకున్న షన్నూ.. ఆ తర్వాత సిరితో స్నేహం.. శ్రుతి మించిన హగ్గులు.. ముద్దులతో తనను తాను మరింత దిగజార్చుకున్నాడు. ముఖ్యంగా సిరి పై అరవడం.. మిగతా కంటెస్టెంట్స్ సిరితో మాట్లాడితే సహించలేకపోవడంతో షన్నూ క్రేజ్ తగ్గుతూ వచ్చింది.

అయితే షన్నూతో స్నేహం.. సిరికి మేలు చేసినా.. షన్నూకు మాత్రం బిగ్‏బాస్ టైటిల్ చేజార్చుకున్నాడు. సిరితో స్నేహం చేయడం.. ప్రతిసారి హగ్గులు.. ముద్దులతో ప్రేక్షకులకు చిరాకు పుట్టించడమే కాకుండా.. చివరకు రన్నరప్‏గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. షన్నూ టైటిల్ గెలవకపోవడానికి ప్రధాన కారణం సిరితో ఎమోషనల్ బాడింగ్ ఏర్పడడమే అనే విషయంలో సందేహం లేదు. ఇదే విషయాన్ని బిగ్‏బాస్ బజ్ ఇంటర్వ్యూలో షణ్ముఖ్ సైతం ఒప్పుకున్నాడు.

బిగ్‏బాస్ బజ్ ఇంటర్వ్యూలో అరియానా అడిగిన ప్రశ్నలకు తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు షణ్ముఖ్. సిరి తనకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రమే కాదని.. క్యారెక్టర్ చూసి ప్రేక్షకులు ఓట్స్ వేస్తారని చెప్పాడు. సిరి వాళ్ల మదర్ వచ్చి హగ్ చేసుకోవడం నచ్చడం లేదని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని.. ఇలా అందరి ముందే చెప్పడం కంటే పక్కకు పిల్చుకుని చెబితే బాగుండేదని.. ఆ సమయంలో అరె ఎంట్రా ఇది అనిపించిదని చెప్పాడు షణ్ముఖ్.

దీప్తి రియాక్షన్ ఎలా ఉంటుందని అరియానా అడగ్గా.. అలుగుతుందని చెప్పాడు షణ్ముఖ్. ఎక్కువ ఆలోచించడమే తనకు సమస్యగా మారుతుందని..సిరి విషయంలో ఎక్కువగా ఆలోచించాను అంటూ చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. ఆ తర్వాత రవిని మీరే నామినేట్ చేసి.. మళ్లీ ఎలిమినేట్ అయిన తర్వాత్ మిస్ యూ రవి అని అన్నారని అడగ్గా.. మొదట్లో రవి నచ్చలేదని.. కానీ ఆ తర్వాత రవితో కనెక్షన్ పెరిగిందని.. తనకు బ్రదర్ అన్నాడు షణ్ముఖ్. మీ సపోర్ట్ వలన, మీ ఫ్యాన్ బేస్ వలన సిరి టాప్ 5 వరకు వచ్చిందా అని అరియానా అడగ్గా.. ఫిఫ్టీ.. ఫిఫ్టీ అని ఆన్సర్ ఇచ్చాడు షణ్ముఖ్. సిరిని ప్రోటెక్ట్ చేస్తూ సాధించారా ? అని అరియానా ప్రశ్నించగా.. అవునని చెప్పాడు షన్నూ. తన ఆలోచనలకు సిరి బలయ్యిందని చెప్పాడు షన్నూ. ఇక చివరగా.. సిరితో కనెక్ట్ కావడం వలనే రన్నరప్ అయ్యాను అని అనిపించిందా అని అరియానా అడగ్గా.. అదే అయ్యింది అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు షన్నూ. తనకు బయట ఇలా జరుగుతుందని తెలుసని.. కానీ తన ఫీలింగ్స్ ఆపుకోలేదని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.. మొత్తానికి సిరితో కనెక్ట్ కావడం వలనే తను రన్నరప్ అయ్యాయని తెల్చీ చెప్పాడు షన్నూ.

Also Read: Bigg Boss 5 Telugu Siri: అరియానా ప్రశ్నలకు సిరి మైండ్ బ్లాంక్.. ఒక్కో ప్రశ్నతో చుక్కలు చూపించిందిగా..

Vijay and Rashmika: ముంబయిలో డిన్నర్‌ డేట్‌కి వెళ్లిన రౌడీ, రష్మిక.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్‌ కంపల్సరీ.. మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేసిన సమంత..