Bigg Boss 5 Telugu Siri: అరియానా ప్రశ్నలకు సిరి మైండ్ బ్లాంక్.. ఒక్కో ప్రశ్నతో చుక్కలు చూపించిందిగా..

బిగ్‏బాస్ సీజన్ 5లో ఓన్లీ లేడీగా నిలిచింది సిరి. మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‏గా పేరు తెచ్చుకున్న సిరి.. ఆ తర్వాత తన

Bigg Boss 5 Telugu Siri: అరియానా ప్రశ్నలకు సిరి మైండ్ బ్లాంక్.. ఒక్కో ప్రశ్నతో చుక్కలు చూపించిందిగా..
Siri
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Dec 21, 2021 | 9:48 PM

బిగ్‏బాస్ సీజన్ 5లో ఓన్లీ లేడీగా నిలిచింది సిరి. మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‏గా పేరు తెచ్చుకున్న సిరి.. ఆ తర్వాత తన స్నేహితుడు షణ్ముఖ్ కోసమే గేమ్ ఆడుతున్నా అన్నట్టుగా మారిపోయింది. ఎమోషనల్‏గా కనెక్ట్ అవుతున్నా అని నాగార్జున ముందే చెప్పేసి తెగ ఫీలయ్యింది సిరి. షణ్ముఖ్ ఎన్ని మాటలు అన్నా.. అలగడం.. మళ్లీ వెళ్లి హగ్గులు ఇచ్చుకోవడం.. తనను తాను ఫిజికల్ హర్ట్ చేసుకోవడం వంటి చేష్టలతో ప్రేక్షకులకు విసుగు పుట్టింది. ముఖ్యంగా సిరి.. షణ్ముఖ్‏తో స్వేహం ఆమెకు బాగానే కలిసోచ్చింది.. కానీ షన్నూకు మాత్రం బారీగానే డ్యామేజ్ జరిగిందనే చెప్పుకొవాలి. షన్నూతో సిరి క్లోజ్ గా ఉండడం వల్లే ఆమె టాప్ 5లోకి వెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

షన్నూ, సిరి ప్రతి హగ్గులు.. ముద్దులతో ప్రేక్షకులను మరింత చిరాకు పుట్టించారు. ఇక బిగ్‏బాస్ సైతం వీరిద్దరి పైనే ఫోకస్ ఎక్కువగా పెట్టి మరీ ప్రోమో.. ఎపిసోడ్‏లో వీరికే స్క్రీన్ స్పేస్ ఇస్తూ.. ప్రతిసారి వీళ్ల హగ్గుల యవ్వారాన్ని బయటపెట్టాడు. ఒకానొక సమయంలో సిరి తల్లి వచ్చి మీరిద్దరు హగ్ చేసుకోవడం నచ్చడం లేదు అని చెప్పడం.. సిరి తిరిగి తన తల్లిపైనే సీరియస్ కావడం.. ఆ తర్వాత.. ప్రతిసారి హగ్ చేసుకుంటూనే ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ తన తల్లిమాటలను తప్పు అనేట్టుగా ప్రవర్తించింది సిరి. గ్రాండ్ ఫినాలే వరకు సిరి, షన్నూ హగ్గులు మాత్రం తగ్గించలేదు.

ఇదిలా ఉంటే.. సిరికి తన ప్రశ్నలతో చుక్కలు చూపించింది యాంకర్ అరియానా. ప్రేక్షకులు మనసులో ఉన్న సందేహాలను అరియానా సిరి ముందు పెట్టింది. రావడంతోనే షన్నూ ఫోటో చూపించి అతడి గురించి చెప్పమని అడిగింది అరియానా. దీంతో అందరికే తెలిసిందే కదా అని అనగానే.. అరియానా రెండు చేతులు చాపి హగ్గు కోసం వెళ్లింది. దీంతో షాకయిన సిరి హగ్ ఇవ్వడంతో ఫ్రెండ్ షిప్ హగ్.. ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ సిరి గాలి తీసేసింది. దీంతో నా హగ్గులు బాగానే వెళ్లినట్టున్నాయి అని నవ్వుకుంది సిరి. ఇక ఆతర్వాత.. ఇన్ని రోజులు ఒంటరిగా ఆడారా ? సపోర్ట్ తీసుకుని ఆడారా ? అని అడగ్గా ఒంటరిగానే ఆడాను అంటూ చెప్పుకొచ్చింది సిరి. ఆ తర్వాత.. షన్నూ దూరంగా ఉండు అన్నాడు కదా అని అరియానా అడగ్గా.. తన ఉద్దేశ్యం అది అంటూ స్టార్ట్ చేసింది. దీంతో ముందు నీ ఉద్దేశ్యం చెప్పే బంగారం.. ఎప్పుడు షన్నూ.. షన్నూఏనా అంటూ అదిరిపోయే పంచ్ వేసింది అరియానా. రవిని నామినేట్ చేసి మళ్లీ రవి ఐ మిస్ యూ అన్నారెంటీ అని అడగ్గా.. తనను తాను మరోసారి కవర్ చేసుకునేందుకు అర్థంలేని ఆన్సర్ ఇచ్చేసింది సిరి. దీంతో కావాలని చెప్తున్నావే.. మర్చిపోయావో అంటూ మరోసారి కౌంటర్ వేసింది అరియానా.

అలాగే సన్నీని టార్గెట్ చేశావ్ అని అరియానా అడగ్గానే.. లేదు నేను చేయలేదు.. ప్రామిస్ అంటూ చెప్పింది సిరి. కానీ మీరిద్దరూ స్నేహితులు కావాల్సింది అనగానే.. ఎప్పుడు గొడవలే ఇంకా స్నేహం ఎలా వస్తుంది అనేసింది సిరి. దీంతో షన్నూతో కూడా గొడవలు అయ్యాయి కదా అని అరియానా అడగ్గానే ఆన్సర్ ఇవ్వలేకపోయింది సిరి. ఇక షన్నూకు సిరి ముద్దు పెట్టడం కూడా అరియానా అడగడంతో సిరికి మైండ్ బ్లాంక్ అయ్యింది. షన్నూ.. చోటులో ఎవరు కావాలంటూ సిరిపై ప్రశ్నల వర్షం కురిపించిది అరియానా. మొత్తానికి అరియానా తన ఇంటర్వ్యూలో ఒక్కో ప్రశ్నతో సిరికి చుక్కలు చూపించింది. సిరిని సూటిగా ప్రశ్నించిన అరియానాపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

Also Read: Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్‌ కంపల్సరీ.. మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేసిన సమంత..