Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్‌ కంపల్సరీ.. మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేసిన సమంత..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం ' పుష్ప'. పుష్పరాజ్‌ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక సందడి చేసింది

Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్‌ కంపల్సరీ.. మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేసిన సమంత..
Samantha
Follow us
Basha Shek

|

Updated on: Dec 20, 2021 | 9:22 PM

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘ పుష్ప’. పుష్పరాజ్‌ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక సందడి చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది . బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తో దూసుకెళుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బన్నీ నటన, సుకుమార్‌ టేకింగ్‌పై ప్రశంసలు కురుస్తున్నా్యి. ఇక సమంత నటించిన ‘ఊ అంటావా మావా.. ఊహు అంటావా’ పాట ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫోక్‌ సింగర్‌ ఇంద్రావతి చౌహాన్‌ హస్కీ వాయిస్‌తో ఆలపించిన ఈ పాట సినిమా విడుదలకు ముందే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ సొంతంచేసుకుంది. ఇక రిలీజ్‌ తర్వాత మరింత హైప్‌ వచ్చింది. ముఖ్యంగా సమంత స్టెప్స్, ఎక్స్‏ప్రెషన్స్‏అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలోనూ ఈ పాటదే హవా. చాలామంది నెటిజన్లు ఈ సాంగ్‌ను రీక్రియేట్‌, స్ఫూప్‌లు చేస్తున్నారు. ఫన్నీ వీడియోలు చేస్తున్నారు. కాగా ఈ పాటలోఅందంగా కనిపించేందుకు ఎంతో కష్టపడ్డానంటోంది సామ్‌. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్‌ షేర్‌ చేసింది. ‘నా సినిమా కెరీర్‌లో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో మంచి క్యారెక్టర్లతో పాటు ప్రతినాయకురాలి పాత్రలు పోషించాను. ఫన్నీ, సీరియస్‌ క్యారెక్టర్లలో కూడా నటించాను. ఒక చాట్‌షో(బిగ్‌బాస్‌)కు హోస్ట్‌గా కూడా వ్యవహరించాను. నేను నాకిచ్చిన బాధ్యతలను సమర్థంగా పోషించడానికి 100శాతం కష్టపడతాను. కానీ సెక్సీ (అందం)గా కనిపించాలంటే మాత్రం అంతకుమించి కష్టపడాలి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని ఈ సందర్భంగా ‘ఊ అంటావా మావా.. ఊహు అంటావా’ పాట హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించింది సామ్‌.

Also Read:

Nani: మీసాలు నిమురుతూ నానికి ‘లయన్‌’ అని బిరుదిచ్చిన జున్ను.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Nitin: పుష్ప సినిమాను వీక్షించిన నితిన్‌.. ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే..

Radheshyam: ప్రభాస్‌ సినిమాలో పెదనాన్న కృష్ణం రాజు పాత్ర ఇదే.. రాధేశ్యామ్‌ కోసం ఇలా..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..