Nani: మీసాలు నిమురుతూ నానికి ‘లయన్‌’ అని బిరుదిచ్చిన జున్ను.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

మరికొన్ని రోజుల్లో 'శ్యాయ్‌ సింగరాయ్‌'గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు నేచురల్‌ స్టార్‌ నాని. సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నాడు.

Nani: మీసాలు నిమురుతూ నానికి 'లయన్‌' అని బిరుదిచ్చిన జున్ను.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..
Follow us
Basha Shek

|

Updated on: Dec 20, 2021 | 8:55 PM

మరికొన్ని రోజుల్లో ‘శ్యాయ్‌ సింగరాయ్‌’గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు నేచురల్‌ స్టార్‌ నాని. సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నాడు. ‘ట్యాక్సీవాలా’ ఫేం రాహుల్‌ సాంకృత్యన్‌ ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. కాగా సినిమాల సంగతి పక్కన పెడితే తీరిక దొరికినప్పుడల్లా తన కుటుంబంతో గడిపేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తుంటాడు నాని. తన సతీమణి అంజన, గారాల తనయుడు అర్జున్‌ (జున్ను) తో సరదాగా గడుపుతుంటాడు. అనంతరం ఆ విషయాలను సోషల్‌ మీడియాలో పంచుకుని మురిసిపోతుంటాడు. తాజాగా తన కుమారుడు జున్నుతో ఆడుకుంటున్న ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడీ నేచురల్‌ స్టార్‌.

కోల్‌కతా నేపథ్యంలో సాగే ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో డబుల్‌రోల్‌లో నటిస్తున్నాడు నాని. అందులో ఒక పాత్రలో కోరమీసంతో కనిపిస్తున్నాడు. తాజా వీడియోలో నాని బెడ్‌పై పడుకుని ఉండగా.. జున్ను తన తండ్రిపై కూర్చొని మీసంతో ఆడుకుంటున్నాడు. తండ్రి మీసాలను మెలితిప్పుతున్న అర్జున్‌ను చూసి నాని ‘నాపేరు ఎంటో తెలుసా’ అని కుమారుడిని అడుగుతాడు. అప్పుడు అర్జున్‌ తెలుసంటూ ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అని ఆన్సర్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ‘సింహం లాగా ఉన్నావు నాన్న’ అంటూ మీసాలు తిప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. తండ్రీ కొడుకులను ఒకే ఫ్రేములో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

Nitin: పుష్ప సినిమాను వీక్షించిన నితిన్‌.. ట్విట్టర్‌లో ఏం చెప్పారంటే..

Krithi Shetty: అందుకే శ్యామ్ సింగరాయ్ సినిమా చేశాను.. ఆసక్తికర విషయం చెప్పిన బెబ్బమ్మ..

Radheshyam: ప్రభాస్‌ సినిమాలో పెదనాన్న కృష్ణం రాజు పాత్ర ఇదే.. రాధేశ్యామ్‌ కోసం ఇలా..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే