AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: అందుకే శ్యామ్ సింగరాయ్ సినిమా చేశాను.. ఆసక్తికర విషయం చెప్పిన బెబ్బమ్మ..

న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ గా రానున్నాడు. గత రెండేళ్లుగా థియేటర్స్ లో అడుగుపెట్టని నాని ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ గాప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

Krithi Shetty:  అందుకే శ్యామ్ సింగరాయ్ సినిమా చేశాను.. ఆసక్తికర విషయం చెప్పిన బెబ్బమ్మ..
Krithi Shetty
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2021 | 8:11 PM

Share

shyam singha roy: న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ గా రానున్నాడు. గత రెండేళ్లుగా థియేటర్స్ లో అడుగుపెట్టని నాని ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ గాప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ మడోనా సెబాస్టియన్ మాట్లాడుతూ.. శ్యామ్ సింగ రాయ్ టీంతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో మంచి టీం. అద్భుతమైన కథ. ఈ సినిమాను మీరంతా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ చిత్రం భాగస్వామిని అవ్వడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.

అలాగే మరో హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘నేను ఏం చేసినా కూడా మీ (ఆడియెన్స్) కోసమే చేస్తాను. ఈ పాత్రను కూడా అందుకే చేశాను. ఈ పాత్ర బెబ్బమ్మలాంటిది కాదు. కృతి లాంటిది కూడా కాదు. మీకు ఓ కొత్త ఫీల్‌ను ఇస్తానని అనిపించింది. అందుకే ఈ పాత్రను చేశాను. కీర్తి పాత్రకు యూత్ బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చినందుకు రాహుల్ గారికి థ్యాంక్స్. నాని గారు అందరినీ ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయన ఎంతో స్వీట్ పర్సన్. సాయి పల్లవి యాక్టింగ్‌కి అందరూ ఫిదా అయిపోతారు’ అని చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa : బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్న ‘పుష్ప’ రాజ్.. రెండు రోజుల్లోనే సరికొత్త రికార్డ్..

AP Movie Tickets: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ జీవో రద్దు అన్నీ థియేటర్లకు వర్తిస్తుందన్న ఏజీ..

Year Ender 2021: ఈ ఏడాదిలో ఎక్కువగా శ్రోతల హృదయాలను గెలుచుకున్న సాంగ్స్ ఇవే..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..