AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Movie Tickets: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ జీవో రద్దు అన్నీ థియేటర్లకు వర్తిస్తుందన్న ఏజీ..

ఆంధప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి గురువారం విచారణ జరిగింది. కాగా గతంలో పిటిషనర్లకు మాత్రమే ఈ జీవో నుంచి మినహాయింపు వస్తుందని ఏపీ హోంశాఖ

AP Movie Tickets: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ జీవో రద్దు అన్నీ థియేటర్లకు వర్తిస్తుందన్న ఏజీ..
Movie Tickets Online
Basha Shek
|

Updated on: Dec 20, 2021 | 3:00 PM

Share

ఆంధప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి గురువారం విచారణ జరిగింది. కాగా గతంలో పిటిషనర్లకు మాత్రమే ఈ జీవో నుంచి మినహాయింపు వస్తుందని ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో నంబర్‌35 పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా టికెట్ ధరల నియంత్రణ పై జీఓ నంబర్‌ 35 రద్దు అన్నీ థియేటర్లకు వర్తిస్తుందని ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ధరల నియంత్రణపై కొత్త కమిటీ ఏర్పాటు, తదితర వివరాలు తెలియజేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం కావాలని ఆయన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

రాష్ట్రంలోని సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 35ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని సవాల్ చేస్తూ పలు థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే అధికారం థియేటర్ యజమానులకు ఉంటుందని వారి తరఫు న్యాయవాదులు తెలిపారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ క్రమంలోనే హైకోర్టు టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35ను రద్దు చేసింది. ఇకతాజాగా సినిమా టికెట్ల విక్రయాల బాధ్యతను APFCకి అప్పగించింది ప్రభుత్వం. త్వరలోనే ఈ ఆన్‌లైన్‌ టికెటింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

Also Read:

Shocking: యూట్యూబ్‌లో చూస్తూ భార్యకు డెలివరీ.. చివరకు ఊహించని విషాదాంతం

Stock market: 15 నిమిషాల్లో వ్యవధిలో రూ.5.2లక్షల కోట్లు ఆవిరి.. ముంచేసిన మండే..

Thar Desert: విస్తరిస్తున్న థార్ ఎడారి.. ఢిల్లీకి పెరగనున్న ముప్పు: రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వెల్లడి

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ