Year Ender 2021: ఈ ఏడాదిలో ఎక్కువగా శ్రోతల హృదయాలను గెలుచుకున్న సాంగ్స్ ఇవే..

సంగీతం.. ఒత్తిడి నుంచి ఉపశమనం కల్గించి.. మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. అందుకే సంగీతాన్ని ఆస్వాదించని

Year Ender 2021: ఈ ఏడాదిలో ఎక్కువగా శ్రోతల హృదయాలను గెలుచుకున్న సాంగ్స్ ఇవే..
Top 9 Telugu Songs
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 20, 2021 | 3:39 PM

సంగీతం.. ఒత్తిడి నుంచి ఉపశమనం కల్గించి.. మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. అందుకే సంగీతాన్ని ఆస్వాదించని వారు ఎవరు ఉండరు. మనసు బాగలేనప్పుడు పాటలే మనసుకు ప్రశాంతతనిస్తాయి. సాధారణంగా ప్రతి వ్యక్తి మూడ్ మార్చేసే ఔషదంగా పనిచేస్తుంది మ్యూజిక్. అందుకే చాలా మంది మానసిక ప్రశాంతత కోసం పాటలు వింటుంటారు. తమకు నచ్చిన పాటను అనేక సార్లు వింటుంటారు. అలాగే ఈ ఏడాది శ్రోతల మనసులను హత్తుకున్న పాటలు ఇవే.

1. ఆది సాయి కుమార్.. సురభి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం శశి. శ్రీనివాస్ నాయడు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలోని

ఓకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే.. అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే.. ఎకాఎకీ కోపం నువ్వే… కోపంలోన దీపం నువ్వే.. దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే… నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా.. అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా..

అంటూ సాగే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటను ఈ సంవత్సరంలోనే అత్యంత ఎక్కువ మంది శ్రోతల మనసును దొచుకుంది.

2. టాలెంటెడ్ హీరో నితిన్.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైన మంచి టాక్ వచ్చింది. ఈ సినిమాలోని

నా కనులు ఎపుడు కననే కననీ.. పెదవులెపుడు అననే అనని.. హృదయం ఎపుడు విననే వినని.. మాయలో తేలుతున్న.. నా మనుసు తలుపే తెరచి తెరచి.. వెలుగు తెరలే పరచి పరచి.. కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణానా.. చేదుపై తీపిలా రేయి పై రంగులా.. నేలపై నింగిలా.. గుప్పెడు గుండెకు పండగ ఈ వేళా.. అంటూ సాగే పాట ప్రేక్షకుల మనసును దొచుకుంది.

3. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాలోని సారంగదరియా సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

దాని కుడి భుజం మీద కడవ.. దాని గుత్తపు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదు ర సెలియా.. దాని పేరే సారంగ దరియ.. దాని ఎడం భుజం మీద కడవ.. దాని ఏజంటు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదు ర సెలియా.. దాని పేరే సారంగ దరియ.. కాళ్లకు ఎండి గజ్జెల్, లేకున్నా నడిస్తే ఘల్ ఘల్.. కొప్పుల మల్లె దండల్, లేకున్నా చక్కిలి గిల్ గిల్.. నవ్వుల లేవుర ముత్యాల్, అది నవ్వితే వస్తాయ్ మురిపాల్.. నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మలపాకుల్.. మునిపంటితో మునిపంటితో మునిపంటితో నొక్కితే పెదవుల్.. ఎర్రగ అయితది రా మన దిల్.. చురియా చురియా చురియా.. అది సుర్మా పెట్టిన చురియా.. అది రమ్మంటే రాదు ర సెలియా.. దాని పేరే సారంగ దరియ..

4. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాలోని నీ చిత్రం చూసి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో.. ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో.. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో.. ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో.. నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు.. నీ గుండె మీదనే వేసుకుందు.. నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో..

5. యంగ్ హీరో కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలో నటించిన అర్ధ శతాబ్దం సినిమాలోని ఏ కన్నులూ చూడనీ సాంగ్ కూడా ఈ ఏడాది సూపర్ హిట్ అయ్యింది.

ఏ కన్నులూ చూడనీ చిత్రమే.. చూస్తున్నది నేడు నా ప్రాణమే.. ఏ కన్నులూ చూడనీ చిత్రమే.. చూస్తున్నది నేడు నా ప్రాణమే.. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం.. ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం.. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే.. గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే అందమైన ఊహలెన్నో ఊసులాడేలే.. అంతులేని సంబరాన ఊయలూపెలే.. ఏ కన్నులూ చూడనీ చిత్రమే.. చూస్తున్నది నేడు నా ప్రాణమే..

6. మెగా హీరో వైష్ణవ్ తేజ్.. కృతి శెట్టి జంటగా నటించిన ఉప్పెన సినిమాలో జల జల జలపాతం నువ్వు సాంగ్ కూడా ఈ ఏడాది ఎక్కువ మంది విన్నారు.

జల జల జలపాతం నువ్వు.. సెల సెల సెలయేరుని నేను.. సల సల నువ్వు తాకితే నన్ను.. పొంగే వరదైపోతాను.. చలి చలి చలి గాలివి నువ్వు.. చుర చుర చుర అలనే నేను.. చర చర నువ్వల్లితే నన్ను.. ఎగసే కెరటాన్నావుతాను..

7. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. నిత్యా మీనన్ జంటగా నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన అంత ఇష్టం ఎందయ్యా సాంగ్ ట్రెండ్ అవుతుంది.

ఈసింత నన్నట్టా.. న న న న.. కూసింత పంజెయ్యనియ్యవూ.. ఎంతోడివేగాని.. హ్మ్మ్ హ్మ్మ్ న న.. ముద్దిస్తే మారాము సెయ్యవూ.. పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది.. నా ఇంటి పెనివిటివే బొట్టెట్టి ముద్దెట్టి నను చేరదీసిన.. దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావ.. నా బలశాలి మావ.. నా మెల్లోని.. నల్లపూసల్లొ మణిపూసవే నా సుడిగాలి మావ.. ఈసింత నన్నట్టా.. పోనె పోనియ్యవు.. కూసింత పంజెయ్యనియ్యవూ ఎంతోడివేగాని.. సంటోడివే నువ్వు.. ముద్దిస్తే మారాము సెయ్యవూ గాలి కౌగిల్లుగా.. చుట్టు ముట్టేసి ఉంటావు ఊపిరాడనీవురయ్యా నా పుట్టుమచ్చలకు.. తోడబుట్టినావు నీకు నాకు దిష్టి.. తీయ్యా అంత ఇష్టం ఏందయ్యా.. అంత ఇష్టం ఏందయ్యా.. అంత ఇష్టం ఏందయ్యా నీకు.. నా మీనా అంత ఇష్టం ఏందయ్యా నీకూ..

8. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.. ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని చిట్టి సాంగ్ ఫేమస్ అయ్యింది.

చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే.. అట్ట నువ్ గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే.. నువ్వు నాకు సెట్టయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే..

వచ్చేశావే లైనులోకి వచ్చేశావే… చిమ్మ చీకటికున్న జిందగిలోన ఫ్లడ్ లైటేసావే.. హత్తెరీ నచ్చేసావే మస్తుగా నచ్చేసావే.. బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలోన రంగులు పూసావే.. చిట్టి నా బుల్ బుల్ చిట్టి, చిట్టి నా చుల్ బుల్ చిట్టి.. నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే.. చిట్టి నా జిల్ జిల్ చిట్టి, చిట్టీ… నా రెడ్ బుల్ చిట్టి.. నా పేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే..

9. అమిత్‌ తివారి, భానుశ్రీ హీరో,హీరోయిన్లు నటించిన తాజా చిత్రం ‘నల్లమల’.రవిచరణ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ఏమున్నావవే పిల్లా సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

లేత లేగదూడ పిల్ల తాగే.. పొదుగులోని పాల రంగు నువ్వే.. పచ్చ పైరు ఓని ఒంటికేసుకొని ఏమున్నవే.. నింగి సాటుకున్న సినుకు నువ్వే.. సూటిగా దూకేసి తాకినావే.. ఎలిసిపోని వాన జల్లులాగా ఏమున్నవే.. ఓ… మల్లెపూలన్నీ కుళ్ళుకునేలా.. ఏమున్నవే పిల్ల… ఏమున్నవే.. తేనెటీగలన్నీ సుట్టుముట్టేలా.. ఏమున్నవే పిల్ల… ఏమున్నవే.. సూరీడు సూడు పొద్దు దాటినా నిన్ను సూసి పోలేడే సీకటి ధాటినా సెందురుడు… దాగే లాగా ఏమున్నవే..

Also Read: Bigg Boss 5 Telugu Winner and Updates: అంబరాన్ని అంటుతున్న సంబరాలు.. రచ్చ రచ్చ చేస్తున్న సన్నీ ఫ్యాన్స్‌..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ టైటిల్‌ ఎగిరేసుకు పోయిన సన్నీ.. ఇంకా ఏమేం గెలుచుకున్నాడో తెలుసా.? అక్షరాల..

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..

Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..