Shocking: యూట్యూబ్‌లో చూస్తూ భార్యకు డెలివరీ.. చివరకు ఊహించని విషాదాంతం

చేతిలో స్మార్ట్‌ ఫోన్, దానికి ఇంటర్నెట్‌ ఉండే చాలు, ఎవరికి వాళ్లే మహా మేధావుల్లా ఫీలైపోయే హాఫ్‌ నాలెడ్జ్‌గాళ్లు పెరిగిపోతున్నారు.

Shocking: యూట్యూబ్‌లో చూస్తూ భార్యకు డెలివరీ.. చివరకు ఊహించని విషాదాంతం
Youtube Delivery
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 20, 2021 | 2:27 PM

చేతిలో స్మార్ట్‌ ఫోన్, దానికి ఇంటర్నెట్‌ ఉండే చాలు, ఎవరికి వాళ్లే మహా మేధావుల్లా ఫీలైపోయే హాఫ్‌ నాలెడ్జ్‌గాళ్లు పెరిగిపోతున్నారు. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే చాలు అన్నీ అరచేతిలో ప్రత్యక్షమవుతాయ్. నెట్‌లో చూసి ఏదైనా చేయొచ్చు? అది చాలా ఈజీ వర్క్‌. వాళ్లతో పనేం ఉంది? ఆమాత్రం మనం చేసుకోలేమా? అనుకుంటున్నారు. చెన్నైలో ఓ భర్త అలా తన భార్యకు డెలివరీ చేస్తూ నిండు ప్రాణాన్ని గాల్లో కలిపేశాడు. మరో ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టాడు. రాణిపేట జిల్లా అరక్కోణంలో జరిగిన ఈ ఇన్సిడెంట్‌ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అరక్కోణంలో నివసించే లోకనాథన్‌… తన భార్యకు ఇంట్లోనే పురుడు పోశాడు. ఆండ్రాయిడ్‌ టీవీని ముందు పెట్టుకుని యూట్యూబ్‌లో చూస్తూ డెలివరీ చేశాడు. ఒక్కసారిగా ఇంట్లో నుంచి అరుపులు కేకలు వినిపించడంతో స్థానికులు హడలిపోయారు. రక్తపు మడుగులో ఉన్న మహిళను, పుట్టిన బిడ్డను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బిడ్డ మరణించగా, తల్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లి పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. స్థానికుల కంప్లైంట్‌తో నిందితుడు లోకనాథన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

Also Read: Andhra Pradesh: పిల్లలు కలగలేదని ఇల్లాలికి బొడ్డుతాడు తినిపించారు..పాపం చివరికి

Aishwarya Rai: ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు ఈడీ సమన్లు.. ఆ కేసులో బిగుస్తోన్న ఉచ్చు