Aishwarya Rai: ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు ఈడీ సమన్లు.. ఆ కేసులో బిగుస్తోన్న ఉచ్చు

బాలీవుడ్‌లో మరో కలకలం రేగింది. హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు ఈడీ  సమన్లు జారీ చేసింది.

Aishwarya Rai: ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు ఈడీ సమన్లు.. ఆ కేసులో బిగుస్తోన్న ఉచ్చు
Aishwarya Rai
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 20, 2021 | 12:08 PM

బాలీవుడ్‌లో మరో కలకలం రేగింది. హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు ఈడీ సోమవారం సమన్లు జారీ చేసింది. పనామా పేపర్‌ లీక్‌ కేసులో తమ ముందు హాజరు కావాలని నోటీసులు పంపింది. ఇవాళ ఢిల్లీలోని లోక్‌నాయక్‌ భవన్‌లో తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశించినట్లు సమాచారం.  ఇప్పటికే పనామా లీక్‌ కేసులో ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌పై ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. కాగా మనీలాండరింగ్‌ కేసులో హీరోయిన్లు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, నోరా ఫతేహిలను ఇప్పటికే ఈడీ విచారిస్తోంది. మనీలాండరింగ్‌ కేసులో వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈడీ ఐశ్వర్యరాయ్‌కు ఈడీ నోటీసులు పంపడం.. బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది.

ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ వెలుగులోకి వచ్చిన రహస్య పత్రాలు కలకలం రేపుతున్నాయి. అనేక దేశాల్లో పేరొందిన ప్రముఖులు పన్నులు కట్టకుండా విదేశీ బ్యాంకుల్లో దాచిన ఖాతాల వివరాలు బయటకొచ్చాయి. ‘పనామా పత్రాలు’ పేరిట అప్పట్లో వెలుగులోకి రావడం సంచలనం రేపింది. పనామా దేశానికి చెందిన మొసాక్‌ ఫోన్సెకా అనే కార్పొరేట్‌ సంస్థ వేలాది సూట్‌కేసుల కంపెనీ బాగోతాలు బయటపెట్టింది. 2016లో బయటపడ్డ పనామా పేపర్స్‌ లీకేజీతో పలువురు ప్రముఖులపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి.

వివిధ దేశాల రాజకీయ నాయకులు, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు, ఇతర సెలబ్రిటీల మనీ లాండరింగ్ వ్యవహారాలు పనామా పేపర్స్ లీక్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. మన దేశంలోనూ పనామా లీక్స్ ప్రకంపనలు రేపగా… ఈడీ ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.  పనామా పేపర్స్‌ కేసులో భారత్ నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం.

Also Read: Andhra Pradesh: పిల్లలు కలగలేదని ఇల్లాలికి బొడ్డుతాడు తినిపించారు..పాపం చివరికి