AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa : బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్న ‘పుష్ప’ రాజ్.. రెండు రోజుల్లోనే సరికొత్త రికార్డ్..

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తుంది. మునుపెన్నడూ కనిపించాను మాస్.. కాదు కాదు ఊర మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తున్నాడు బన్నీ

Pushpa : బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్న 'పుష్ప' రాజ్.. రెండు రోజుల్లోనే సరికొత్త రికార్డ్..
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2021 | 2:53 PM

Share

Pushpa : అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తుంది. మునుపెన్నడూ కనిపించాను మాస్.. కాదు కాదు ఊర మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తున్నాడు బన్నీ. సుకుమార్ మేకింగ్.. బన్నీ యాక్టింగ్ వెరిసి పుష్ప‌గా ప్రేక్షకులను అలరిస్తుంది. గంధపు చెక్కల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన పుష్ప 1 ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. మొదటి రోజు 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. రెండో రోజు కూడా అదే జోరు చూపించాడు. తొలిరోజు 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు మరో 45 కోట్లు గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది.

తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాస్తున్నాడు ఐకాన్ స్టార్. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప. రెండో రోజు కూడా ఈ చిత్రానికి అన్నిచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మూడో రోజు కూడా అద్భుతంగా ఓపెన్ అయింది. అల్లు అర్జున్ మాస్ స్టామినాకు ఇది నిదర్శనం అంటున్నారు అభిమానులు. బన్నీ పర్ఫార్మెన్స్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. పుష్ప సినిమాను కేవలం అల్లు అర్జున్ కోసమే చూడొచ్చు అనేలా థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు ఆడియన్స్. కేవలం తెలుగులోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో అయితే అంచనాలకు మించి అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది పుష్ప. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 116 కోట్ల గ్రాస్ వచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పుష్ప సినిమాను నిర్మించారు. మరి ఈ సినిమా ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్  ను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

AP Movie Tickets: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ జీవో రద్దు అన్నీ థియేటర్లకు వర్తిస్తుందన్న ఏజీ..

Year End 2021: ఈ ఏడాదిలో ఎక్కువగా శ్రోతల హృదయాలను గెలుచుకున్న సాంగ్స్ ఇవే..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ఎవరికి ఎక్కువ అంటే..

Follow Us