Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ఎవరికి ఎక్కువ అంటే..

బిగ్‏బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షో ముగిసింది. ఆదివారం సాయంత్రం గ్రాండ్‏గా అంగరంగ వైభవంగా జరిగింది. 19 మందితో

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ఎవరికి ఎక్కువ అంటే..
Top 5
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 20, 2021 | 12:23 PM

బిగ్‏బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షో ముగిసింది. ఆదివారం సాయంత్రం గ్రాండ్‏గా అంగరంగ వైభవంగా జరిగింది. 19 మందితో మొదలైన ఈ షోలో చివరకు సన్నీ, శ్రీరామ్, మానస్, సిరి, షణ్ముఖ్ టాప్ 5 కంటెస్టెంట్స్‏గా మిగిలారు. ఇందులో షణ్ముఖ్ రన్నరప్ గా నిలవగా.. వీజే సన్నీ బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా నిలిచారు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వీజే సన్నీ హావా కొనసాగుతుంది. సన్నీకి సంబంధించిన రేర్ ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్‏బాస్ ఇంట్లో పటాకాగా పేరు తెచ్చుకున్న సిరి ఈ షో ద్వారా రెమ్యునరేషన్ బాగానే అందుకున్నట్లుగా టాక్. వెబ్ సిరీస్, సీరియళ్ల ద్వారా ఎక్కువగా పాపులారిటీ సొంతం చేసుకున్న సిరి.. వారానికి రూ. లక్షన్నర వరకు అందుకున్నట్లుగా సమాచారం. అంటే.. పదిహేను వారాలకు గానూ.. సుమారు పాతిక లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇక నాల్గవ స్థానానికి పరిమితమైన మానస్ కూడా ఈ షోలో ఎక్కువగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. తన ఆటతీరుతో తెలుగు ప్రజలను మనసును దొచుకున్నాడు మానస్. ఈ షో ద్వారా వారానికి లక్ష నుంచి లక్షన్నర వరకు రెమ్యునరేషన్ అందుకున్నాడట. అంటే పదిహేనువారాలకు సుమారు రూ. 20 లక్షల వరకు అందుకోనున్నట్లుగా టాక్.

అలాగే మూడో స్థానంలో నిలిచిన సింగర్ శ్రీరామచంద్ర కూడా రెమ్యునరేషన్ ఎక్కువగానే తీసుకున్నట్లుగా సమాచారం. ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచి ఎంతో పాపులారిటీని అందుకున్నాడు శ్రీరామచంద్ర. అలాగే బిగ్‏బాస్ తొలి పైనలిస్ట్‏గా ఎంట్రీ ఇచ్చిన శ్రీరామచంద్ర వారానికి లక్షన్నర తీసుకున్నాడట.

ఇక యూట్యూబ్‏లో వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‏తో షణ్ముఖ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సిరీస్‏తో షన్నూ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇక అదే క్రేజ్‏తో బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాడు షణ్ముఖ్. మిగతా కంటెస్టెంట్లతో పోలీస్తే.. షన్నూ వారానికి రూ. 2 లక్షల వరకు తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇక చివరగా బిగ్ బాస్ విజేతగా నిలిచిన వీజే సన్నీ.. అలియాస్ అరుణ్ రెడ్డి.. జర్నలిస్ట్‏గా కెరీర్ ఆరంభించి కళ్యాణ వైభోగం సీరియల్‏ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇందులో జై పాత్ర ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నాడు సన్నీ. ఇక బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచి రెండు రాష్ట్రాల ప్రజల మనసులను దొచుకున్నారు. అయితే సన్నీ బిగ్ బాస్ సీజన్ 5లో వారానికి రెండు లక్షలు తీసుకున్నట్లుగా టాక్. అంటే 15 వారాల్లో రూ 30 లక్షలు సంపాదించినట్లుగా టాక్ నడుస్తోంది.

Also Read: Bigg Boss 5 Telugu Winner and Updates: అంబరాన్ని అంటుతున్న సంబరాలు.. రచ్చ రచ్చ చేస్తున్న సన్నీ ఫ్యాన్స్‌..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ టైటిల్‌ ఎగిరేసుకు పోయిన సన్నీ.. ఇంకా ఏమేం గెలుచుకున్నాడో తెలుసా.? అక్షరాల..

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..

Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!