AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radheshyam: ప్రభాస్‌ సినిమాలో పెదనాన్న కృష్ణం రాజు పాత్ర ఇదే.. రాధేశ్యామ్‌ కోసం ఇలా..

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్‌'. గోపీచంద్‌తో 'జిల్‌' లాంటి యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ను తెరకెక్కించిన 'రాధాకృష్ణకుమార్‌' ఈ వింటేజ్‌ లవ్‌స్టోరీకి

Radheshyam: ప్రభాస్‌ సినిమాలో పెదనాన్న కృష్ణం రాజు పాత్ర ఇదే.. రాధేశ్యామ్‌ కోసం ఇలా..
Basha Shek
|

Updated on: Dec 20, 2021 | 7:48 PM

Share

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. గోపీచంద్‌తో ‘జిల్‌’ లాంటి యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ను తెరకెక్కించిన ‘రాధాకృష్ణకుమార్‌’ ఈ వింటేజ్‌ లవ్‌స్టోరీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈనేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. కాగా ‘బిల్లా’, ‘రెబెల్‌’ సినిమాల తర్వాత మరోసారి ‘రాధేశ్యామ్‌’లో స్ర్కీన్‌పై కలిసి కనిపించనున్నారు ప్రభాస్‌- కృష్ణంరాజు. తాజాగా సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

‘రాధేశ్యామ్‌’లో పరమహంస అనే స్వామీజీ పాత్రలో నటిస్తున్నట్లు ఈ ఫస్ట్‌లుక్‌ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో కృష్ణం రాజుతో పాటు భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జస్టిన్‌ ప్రభాకరణ్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

Also Read:

Hema Malini: మహారాష్ట్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన హేమ మాలిని.. ఏం అన్నారంటే.

Hyderabad: చెట్టును ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు..

Andhra Pradesh: మరణించింది అవ్వే కాదు.. మానవత్వం కూడా.. రాత్రి చలికి తాళలేక

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే