Hema Malini: మహారాష్ట్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన హేమ మాలిని.. ఏం అన్నారంటే.

మ‌హారాష్ట్ర మంత్రి, శివ‌సేన నాయకుడు గులాబ్ రావ్ పాటిల్ తన నియోజకవర్గంలోని రోడ్లు బీజేపీ ఎంపీ హేమమాలినీ బుగ్గల్లా ఉన్నాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీ

Hema Malini: మహారాష్ట్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన హేమ మాలిని.. ఏం అన్నారంటే.
Follow us

|

Updated on: Dec 20, 2021 | 7:03 PM

మ‌హారాష్ట్ర మంత్రి, శివ‌సేన నాయకుడు గులాబ్ రావ్ పాటిల్ తన నియోజకవర్గంలోని రోడ్లు బీజేపీ ఎంపీ హేమమాలినీ బుగ్గల్లా ఉన్నాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీజేపీ, మ‌హిళా సంఘాలు ఆగ్రహం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. మంత్రి వెంట‌నే క్షమాపణలు చెప్పాల‌ంటూ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్‌పర్సన్‌ రూపాలి చకన్కర్ డిమాండ్‌ చేశారు. కాఆ ఆదివారం రాష్ట్రంలోని జల్గాన్‌ జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై నటి ఎంపీ హేమమాలిని స్పందించారు. రహదారులను నటీమ‌ణుల బుగ్గలతె పోల్చే సంప్రదాయాన్ని గ‌తంలో ఆర్జేడీ అధ్యక్షులు లాలూప్రసాద్‌ యాద‌వ్ మొద‌లుపెట్టార‌ని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని అంద‌రూ అనుస‌రిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

అయితే ఇలాంటి అనుచిత కామెంట్లు అంత మంచివి కావ‌ని హేమ‌మాలిని అభిప్రాయపడ్డారు. గౌర‌వ పదవులు, హోదాల్లో ఉన్నవాళ్లు, ప్రజా ప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయ‌డం సమంజసం కాదన్నారు . కాగా ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గులాబ్‌రావు పాటిల్‌ను క్షమాపణ అడుగుతారా..? అని ఎంపీని అడగ్గా.. అలాంటి వ్యాఖ్యలను తను పట్టించుకోనని ఆమె పేర్కొన్నారు.

Also Read:

Four Day Week: వారానికి నాలుగు రోజుల పని విధానంపై కేంద్రం కసరత్తులు.. త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం!

Crime News: కనిపించకుండాపోయిన తల్లి, ఇద్దరు పిల్లలు.. వ్యవసాయ బావిలో తేలిన ముగ్గురి మృతదేహాలు!

Jaya Bachchan: కోడలికి ఈడీ సమన్లు.. రాజ్యసభలో బీజేపీకి జయాబచ్చన్‌ శాపనార్థాలు