Crime News: కనిపించకుండాపోయిన తల్లి, ఇద్దరు పిల్లలు.. వ్యవసాయ బావిలో తేలిన ముగ్గురి మృతదేహాలు!

తమిళనాడులో దారుణం జరిగింది. కనిపించకుండా పోయిన తల్లి, పిల్లలుల బావిలో శవమై తేలారు. దిండిగల్ జిల్లా అయ్యంపాళయం వద్ద శనివారం రాత్రి బావిలో ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు శవమై కనిపించారు.

Crime News: కనిపించకుండాపోయిన తల్లి, ఇద్దరు పిల్లలు.. వ్యవసాయ బావిలో తేలిన ముగ్గురి మృతదేహాలు!
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 20, 2021 | 5:53 PM

Tamil Nadu Suspected Deaths: తమిళనాడులో దారుణం జరిగింది. కనిపించకుండా పోయిన తల్లి, పిల్లలుల బావిలో శవమై తేలారు. దిండిగల్ జిల్లా అయ్యంపాళయం వద్ద శనివారం రాత్రి బావిలో ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు శవమై కనిపించారు. మృతులను ఎస్ లక్ష్మి (22), ఆమె నాలుగేళ్ల కుమారుడు, ఆమె రెండేళ్ల కుమార్తె విస్మితగా గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అయ్యంపాళయంనకు చెందిన లక్ష్మికి శరవణన్ అనే వ్యక్తితో 2016లో వివాహమైంది. అయ్యంపాలెం వద్ద మారుతానది ఒడ్డున ఉన్న కొబ్బరి పొలంలో లక్ష్మి భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గత రెండు నెలలుగా భార్య, భర్త మధ్య తరుచు గొడవలు జరగుతున్నట్లు లక్ష్మి తల్లి వెల్లడించింది. ఈ క్రమంలో ఘర్షణ చోటుచేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని లక్ష్మి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్ష్మి భర్త పని నుండి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, భార్య, పిల్లలు కనిపించకుండా పోయారు. దీంతో తన అత్తగారికి సమాచారం అందించాడు. అనంతరం శరవణన్.. భార్య లక్ష్మి, పిల్లల కోసం వెతకగా, వారి మృతదేహాలు అర్థరాత్రి వ్యవసాయ బావిలో కనిపించాయని పోలీసులు తెలిపారు.

ఈ కేసును విచారిస్తున్న పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాలను దిండిగల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృతులకు పోస్ట్ మార్టం పరీక్షలు నిర్వహించారు. ఈ జంట ఏడేళ్ల కిందటే వివాహం చేసుకున్నారని, వరకట్న వేధింపులు అయ్యి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కాగా ఈ కేసును విచారిస్తున్న పోలీసులు తెలిపారు.

Read Also…  Fake Baba: మహిళా భక్తులే టార్గెట్.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం.. వెలుగులోకి దొంగబాబా రాసలీలలు!