Shashikala: శశికళ అన్నాడీఎంకేలో మళ్లీ ఎంట్రీ ఇస్తారా? పార్టీలో మారుతున్న సమీకరణాలు!
శశికళ అన్నాడీఎంకేలో మళ్లీ ఎంట్రీ ఇస్తారా ? తప్పులు చేసిన వాళ్లను క్షమించాలని పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు పార్టీలో చిచ్చు రేపాయి. చిన్నమ్మకు ఎట్టి పరిస్థితుల్లో రీఎంట్రీ ఉండదన్నారు మాజీ మంత్రి జయకుమార్.
Shashikala: శశికళ అన్నాడీఎంకేలో మళ్లీ ఎంట్రీ ఇస్తారా ? తప్పులు చేసిన వాళ్లను క్షమించాలని పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు పార్టీలో చిచ్చు రేపాయి. చిన్నమ్మకు ఎట్టి పరిస్థితుల్లో రీఎంట్రీ ఉండదన్నారు మాజీ మంత్రి జయకుమార్. ఈ వ్యాఖ్యలతో తమిళనాట ప్రకంపనలు మొదలయ్యాయి. తమిళ రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పేందుకు చిన్నమ్మ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. అన్నాడీఎంకే జాయింట్ కోఆర్డినేటర్‌గా ఎన్నికైన పన్నీర్‌సెల్వం తాజాగా చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. తప్పు చేసి పశ్చత్తాపపడుతున్న వారిని క్షమించాలని.. వారికి తిరిగి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని ఓపిఎస్ వ్యాఖ్యలు చేశారు. ఓపిఎస్ వ్యాఖ్యలతో అన్నాడీఎంకే పార్టీ లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. శశికళ ని మళ్ళీ పార్టీ లో చేర్చే ప్రక్రియను ఓపిఎస్ ప్రారంభించినట్టు ప్రత్యర్ధులు అనుమానిస్తున్నారు. అయితే పన్నీర్‌సెల్వం ఓపిఎస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అన్నాడీఎంకే ముఖ్య నేతలు . శశికళ ని ఎట్టి పరిస్థితులలో క్షమించేది లేదని , అన్నాడీఎంకే పార్టీ చాలా బలంగా ఉందని , శశికళ చేతిలో పార్టీని పెట్టడం మంచిది కాదని అన్నారు మాజీ మంత్రి జయకుమార్.
ఓపిఎస్ వ్యాఖ్యలు కారణంగా శశికళ ఫై తమ అభిప్రాయం మారదని , ఓపిఎస్ వ్యాఖ్యలు శశికళ కి వర్తించవని జయకుమార్ కౌంటర్ ఇచ్చారు. శశికళకు పన్నీర్ సెల్వం చాలాకాలం నుంచి సన్నిహితంగానే ఉంటున్నారు. కొద్దినెలల క్రితం ఓపీఎస్ భార్య చనిపోయినప్పుడు ఆయన ఇంటికి వచ్చి పరామర్శించారు శశికళ. అన్నాడీఎంకేలో శశికళకు చోటు లేకుండా కొద్దిరోజుల క్రితమే పళనిస్వామి వర్గం తలుపులు మూసేసింది. అన్నాడీఎంకేలో అసలు ప్రధాన కార్యదర్శి పదవి లేకుండా రాజ్యాంగాన్ని మార్చేశారు. ఇదే సమయంలో పన్నీర్‌సెల్వం చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి.
ఇవి కూడా చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. వాయిదా పడనున్న మెగావేలం.. ఎందుకంటే?
Stock Market: ఒమిక్రాన్ భయాలతో స్టాక్ మార్కెట్ కుదేలు.. రూ.6,81,0000 కోట్ల మదుపర్ల సందప ఆవిరి
Jaya Bachchan: కోడలికి ఈడీ సమన్లు.. రాజ్యసభలో బీజేపీకి జయాబచ్చన్ శాపనార్థాలు