Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: ఒమిక్రాన్ భయాలతో స్టాక్ మార్కెట్ కుదేలు.. రూ.6,81,0000 కోట్ల మదుపర్ల సందప ఆవిరి

ఒకవైపు ఫెడ్‌ నిర్ణయాలు, మరోవైపు ఒమిక్రాన్‌ లాక్‌డౌన్‌ భయాలతో స్టాక్‌మార్కెట్‌ భారీ నష్టాలతో ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్‌ 1800 పాయింట్లకు పైగా కోల్పోయినా ఆ తర్వాత కాస్తా కోలుకుంది.

Stock Market: ఒమిక్రాన్ భయాలతో స్టాక్ మార్కెట్ కుదేలు.. రూ.6,81,0000 కోట్ల మదుపర్ల సందప ఆవిరి
Stock Market
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 20, 2021 | 5:48 PM

ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై పడింది. తాజాగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్‌ 1800 పాయింట్లకు పైగా కోల్పోయింది. అయితే చివర్లో కాస్తా కోలుకుని 1189 పాయింట్ల నష్టంతో నాలుగు మాసాల కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. ప్రారంభంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే మదుపర్లు దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర నష్టపోయారు. అయితే ఆ తర్వాత నష్టాలు కాస్త భర్తీకావడంతో కొంతలో కొంత ఊరట చెందారు. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఒక్క రోజే మదుపర్ల సంపద దాదాపు రూ.6.81 లక్షల కోట్లు ఆవిరైపోయింది.

సోమవారంనాడు దాదాపు అన్ని షేర్లూ కుదేలయ్యాయి. ఇక కొత్తగా మార్కెట్‌లోకి అడుగు పెట్టిన ఇన్వెస్టర్‌కి చుక్కలు కనిపించాయి. ఆరంభంలోనే సెన్సెక్స్‌ ఈ స్థాయిలో పడిపోవడంతో కొత్తగా స్టాక్‌ మార్కెట్‌ అడుగు పెట్టిన మదుపరులు డోలాయమానంలో పడిపోయారు. సెన్సెక్స్‌ మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందో ? లేదో ? తెలియక అయోమయంలో పడిపోయారు.   ఉదయం 56,517 పాయింట్ల దగ్గర నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ చివరి వరకు అదే ఫ్లోను కొనసాగించింది. ఒక దశలో 1800 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ 55,132 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. అయితే చివర్లో కోలుకుని 1189 పాయింట్ల నష్టంతో 55,822 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 371 పాయింట్లు కోల్పోయి 16,614 పాయింట్ల దగ్గర ముగిసింది.

అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను మార్చి నాటికి పెంచడంపై అధికారులు బహిరంగంగా సంకేతాలు ఇవ్వడంతో మిగిలిన మార్కెట్ల నుంచి నిధుల మళ్లింపు మొదలైంది. అటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడానికి బాండ్ల కొనుగోళ్లను తగ్గించింది. దీంతో అటు ఒమిక్రాన్‌ విజృంభణతో చాలా దేశాలు లాక్‌డౌన్‌ బాట పట్టడంతో ఇన్వెస్టర్లలో భయం ఏర్పడింది. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ టైమ్‌లో లాక్‌డౌన్‌ వల్ల వ్యాపారాలు దెబ్బ తింటాయనే భయం ఇన్వెస్టర్లలో నెలకొంది. దీంతో అటు ఫెడ్‌ వడ్డీ రేట్లు, ఇటు ఒమిక్రాన్‌ లాక్‌డౌన్‌ భయాల వల్ల స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలతో ముగిసింది.

Also Read..

దగ్గు మందు వికటించి ముగ్గురు చిన్నారుల మృతి.. ఆలస్యంగా వెలుగులోకి దారుణ ఘటన..

TTD: టీటీడీని అంబానీకో, కార్పొరేట్ దిగ్గజాలకో తాకట్టు పెట్టేస్తారు.. ఏపి సాధు పరిషత్ సంచలన వ్యాఖ్యలు!