TTD: టీటీడీని అంబానీకో, కార్పొరేట్ దిగ్గజాలకో తాకట్టు పెట్టేస్తారు.. ఏపి సాధు పరిషత్ సంచలన వ్యాఖ్యలు!

తిరుమత తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

TTD: టీటీడీని అంబానీకో, కార్పొరేట్ దిగ్గజాలకో తాకట్టు పెట్టేస్తారు.. ఏపి సాధు పరిషత్ సంచలన వ్యాఖ్యలు!
Srinivasananda Saraswathi
Follow us

|

Updated on: Dec 20, 2021 | 5:32 PM

AP Sadhu Parishad on TTD: తిరుమత తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉదయాస్తమయ సేవా రుసుము ను కోటీ యాభై లక్షలు గా నిర్ణయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు నిర్ణయం ఏకపక్షంగా ఉందని ఏపి సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. ఏ మఠాన్ని, ఏ పీఠాన్ని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. చివరకు వేంకటేశ్వరస్వామిని అంబానీకో, కార్పొరేట్ దిగ్గజాలకో తాకట్టుపెట్టేస్తారన్న అనుమానం కలుగుతుందన్నారు.

శుక్రవారం రోజున నిర్వహించే ఉదయాస్తమాన సేవాకు కోటిన్నర చెల్లించడం అంటే.. ఇది స్వామిని సామాన్యులకు దూరం చేయడం కాదా అన్నారు. టీటీడీ బోర్డు భక్తులకు సేవచేయటానికే లేదా స్వామివారితో వ్యాపారం చేయటానికా అని శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతి చేసేందుకే టీటీడీ కుట్ర చేస్తోందన్నారు. టీటీడీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే టీటీడీ పాలకమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

ఇదిలావుంటే, తిరుమత తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరలను నిర్ణయించింది టీటీడీ. 2006లో ఉదయాస్తమాన సేవను రద్దు చేసిన టీటీడీ.. 2006 వరకు కేటాయించి మిగిలిపోయిన 531 టికెట్లను భక్తులకు కేటాయించాలని గత పాలకమండలిలో నిర్ణయించింది. అయితే మామూలు రోజుల్లో కోటి రూపాయలు, శుక్రవారం రోజు కోటిన్నర రూపాయలకు ఉదయాస్తమాన సేవ టికెట్లను జారీ చేయాలని టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది.

ఆన్‌లైన్‌లోనే టికెట్ అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఉదయాస్తమాన సేవ టికెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని భావిస్తోంది. ఈ టికెట్‌తో దాదాపు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు భక్తులు. ఏడాదికి ఒక్క రోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనేలా సదుపాయం కల్పిస్తుంది పాలక మండలి. ఈ సేవా టికెట్ల కేటాయింపులో టీటీడీ బోర్డు దాదాపు రూ.600 కోట్లకుపైగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని భావిస్తోంది.

Read Also… Fake Baba: మహిళా భక్తులే టార్గెట్.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం.. వెలుగులోకి దొంగబాబా రాసలీలలు!

Latest Articles