Tirumala: శ్రీవారిపైనా కరోనా ఎఫెక్ట్.. వరసగా రెండో ఏడాది కూడా తగ్గిన స్వామివారి ఆదాయం.. బడ్జెట్‌లో కోత
Tirumala: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు..
Tirumala: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. తిరుమల కొండ నిత్యం వేలాది మంది భక్తులతో సందడిగా ఉండేది. అయితే కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడినట్లే.. దేశంలోని దేవాలయాలపై కూడా పడింది. కరోనా నివారణ కోసం ప్రముఖ పునీక్షేత్రాలతో సహా ఆలయాల్లో భక్తుల దర్శనాలపై పరిమితులు విధించారు. ఈ నేపథ్యంలో కోనేటిరాయుడి ఆదాయం గణనీయంగా తగ్గింది. కోవిడ్ ప్రభావంతో వరసగా రెండో ఏడాది కూడా ఆదాయం తగ్గింది. వివరాల్లోకి వెళ్తే..
టీటీడీ మీద రెండో సంవత్సరం కూడా కొనసాగింది. ఏప్రిల్ లో సెకండ్ వేవ్ విజృంభించింది. ఈ నేపథ్యంలో శ్రీవారికి పెరుగుతుంది అనుకున్న ఆదాయం తగ్గిపోయింది. స్వామి దర్శనానికి ఆన్ లైన్ టికెట్ విధానం.. అది రోజుకి పరిమితి సంఖ్యలోనే అనుమతులు ఉండడంతో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గింది. ఈ ప్రభావం హుండీ కలెక్షన్లపై పడింది.
దర్శన టోకెన్లు: 2021 మార్చి ఆఖరు వారంలో సర్వ దర్శన్ టోకెన్లు 30000 నుండి 15000 కు పడిపోయాయి. ఇక ఏప్రిల్ 12 న సర్వ దర్శన టోకెన్లు నిలిపివేశారు.. అంతేకాదు ఆగష్టు వరకు స్పెషల్ ఎంట్రీ దర్శన టిక్కెట్లు 5వేలు మాత్రమే రిలీజ్ చేసేవారు. అనంతరం కరోనా కొంచెం తగ్గుముఖం పట్టడంతో రోజువారీ దర్శన టికెట్లను 8వేలకి పెంచారు.
అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలు నిలిపివేతతో పాటు.. కాలినడక నిలిపివేత కారణంగా స్వామివారిని దర్శించుకునేవారి సంఖ్య భారీగా తగ్గింది. అంతేకాదు కాదు.. నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు కూడా ఆదాయం తగ్గడానికి ఒక కారణమని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం:
2021 మార్చి లో హుండీ ఆదాయం 105 కోట్ల రూపాయలు ఉండగా ఏప్రిల్ నెలలో 62.62 కోట్ల రూపాయలకు పడిపోయింది. అయితే సెప్టెంబర్ నెలాఖరు నుంచి స్వామివారి దర్శనానికి భక్తుల సంఖ్యను పెంచారు. అంతేకాదు కాలినడక వెళ్లేవారికి దర్శనానికి అనుమతినిచ్చారు. దీంతో మళ్ళీ టీటీడీ ఆదాయం పెరిగింది. ఇప్పుడు స్వామీ వారి ఆదాయం రూ. 75-80 కోట్ల మధ్య ఉంటుంది.
టీటీడీ ఆదాయం తగ్గడంతో వార్షిక బడ్జెట్ లో భాగంగా కేటాయింపులను కూడా తగ్గించారు. 2020-21 లో 3309 కోట్ల బడ్జెట్ వేసిన టీటీడీ ఈ సంవత్సరం కేవలం 2937.82 కోట్లకు బడ్జెట్ ను మాత్రమే వేశారు.
Also Read: కేంద్రం తీరు అభ్యంతరకరం.. ధాన్యం కోలుగోలుపై లిఖిపూర్వక హామీ ఇవ్వాలంటూ నిరంజన్ రెడ్డి డిమాండ్