Srisailam: ఘనంగా మల్లికార్జునుడి స్వామికి ఘనంగా ఆరుద్రోత్సవం.. ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు
Srisailam: దక్షిణాది ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామివారికి వైభవంగా ఆరుద్రోత్సవం జరిగింది. ఉత్సవంలో భాగంగా మల్లికార్జున స్వామికి, అమ్మవార్లకు..
Srisailam: దక్షిణాది ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామివారికి వైభవంగా ఆరుద్రోత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవంలో భాగంగా మల్లికార్జున స్వామికి, భ్రమరాంబ అమ్మవార్లకు వేదపండితులు లింగోద్భవకాల రుద్రాభిషేకం చేశారు. మల్లికార్జునుడి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శోభనామానంగా అలంకరించారు. మల్లికార్జునుడు ఉత్తరద్వారం ద్వారం ద్వారా బయటకు తీసుకుని వచ్చి నంది వాహనంపై అధిష్టింపజేశారు. భక్తులకు దర్శనమిచ్చారు.
మల్లికార్జున స్వామి అమ్మవార్లకు నంది వాహనంపై ఆలయ మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మారుమ్రోగిపోయాయి. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఆరుద్రోత్సవాలను నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీశైల క్షేత్రం పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Also Read: ఆంధ్రకాశ్మీర్ లంబ సింగి పర్యాటక విశేషాలు