లంబసింగి మన్యం ప్రాంతం. డిసెంబరు - జనవరి మాసాల్లో వాతావరణం సుమారుగా 0 డిగ్రీలు ఉంటుంది. ఏడాది పొడవునా ఇక్కడ చల్లగా ఉండడంతో ఆంధ్రా కాశ్మీర్‌గా ఖ్యాతిగాంచింది.
లంబసింగిలో అక్టోబరు మొదలుకుని ఫిబ్రవరి వరకు మంచు వర్షంలా కురుస్తుంది. ఉదయం 10 గంటలకైనా మంచు వీడ కుండా శీతల గాలులు వీస్తు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది
ప్రతి ఏడాది ఏదో ఒక సమయంలో 1- 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో లంబసింగికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు
లంబసింగి సమీపంలో 'చెరువులవేనం' అనే గ్రామం ఉంది. ఆ గ్రామం కొండపైకి ఎక్కితే మంచు మేఘాలను తాకుతున్నట్లుగా కనిపించే 'చెరువులవేనం' పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తోంది
లంబసింగి ఘాట్‌రోడ్డులో కాఫీ తోటలతో పాటు స్ట్రాబెరీ, వరి, మొక్కజొన్న, మిరియాలు సాగు చేస్తున్నారు