Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దగ్గు మందు వికటించి ముగ్గురు చిన్నారుల మృతి.. ఆలస్యంగా వెలుగులోకి దారుణ ఘటన..

సుమారు నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్ ఆస్పత్రిలో ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పందంగా మృతి చెందారు.

దగ్గు మందు వికటించి ముగ్గురు చిన్నారుల మృతి.. ఆలస్యంగా వెలుగులోకి దారుణ ఘటన..
Representational Image
Follow us
Basha Shek

|

Updated on: Dec 20, 2021 | 5:18 PM

సుమారు నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్ ఆస్పత్రిలో ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పందంగా మృతి చెందారు. మరో 13మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ పిల్లల చావుకు నాణ్యతలేని దగ్గుమందే కారణమని దర్యాప్తులో వెల్లడైంది. డెక్స్‌ట్రోమెథార్ఫాన్ కాఫ్ సిరప్ కారణంగానే ఈ పిల్లలు చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) స్పష్టం చేసింది. ఈ మేరకు దర్యాప్తు నివేదిక వివరాలను సోమవారం వెల్లడించింది. కాగా నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్‌ ఆస్పత్రిలో కొందరు పిల్లలు అనారోగ్యంతో చేరారు. వీరికి ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన డెక్స్‌ట్రోమెథార్ఫాన్ కాఫ్ సిరప్‌ను అందించారు. అయితే ఈ మందు వికటించడంతో మొత్తం ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ్డారు. మరో 13 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ విచారణ చేపట్టగా తన దర్యాప్తు నివేదికను తాజాగా బయటపెట్టింది. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌తో పాటు పలు డిస్పెన్సరీల్లో చిన్నారులకు ప్రభుత్వం అందిస్తోన్న డెక్స్‌ట్రోమెథార్ఫాన్ కాఫ్ సిరప్ ఈ చిన్నారుల చావుకు కారణమని డీజీహెచ్ఎస్ పేర్కొంది. ‘ఇదొక నాసిరకం దగ్గుమందని మా విచారణలో తేలింది. అందుకే ఇకపై దీనిని నాలుగేళ్లలోపు చిన్నారులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వద్దు. మొహల్లా క్లినిక్‌లు, డిస్పెన్సరీల్లో పంపిణీ చేస్తోన్న ఈ మందును వెంటనే వెనక్కి తీసుకోవాలి’ అని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. Also Read:

Parliament: ఆధార్‌తో ఓటర్ కార్డు లింక్.. విపక్షాల నిరసనల మధ్య ఆమోదం తెలిపిన లోక్‌సభ

Navjot Sidhu Sidhu: వారిని బహిరంగంగా ఉరితీయాలి.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ డిమాండ్

School Teacher: స్కూల్ వాట్సప్ గ్రూప్​లో పోర్న్ వీడియోల కలకలం.. టీచర్‌పై కేసు నమోదు..!