Bangarraju : ‘వాసివాడి తస్సాదియ్య’ అంటూ.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న బంగార్రాజులు..

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు

Bangarraju : 'వాసివాడి తస్సాదియ్య' అంటూ.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న బంగార్రాజులు..
Bangarraju
Follow us

|

Updated on: Dec 20, 2021 | 7:30 PM

Bangarraju:  కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా రీసెంట్ గా పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నాగార్జున, నాగ చైతన్య కలిసి ఇందులో  స్టెప్పులు వేస్తుండగా.. ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బంగార్రాజుకు పెళ్లయిపోతుందనే బాధను ఫరియా అబ్దుల్లా ఈ పాటలో వివరిస్తారు. ఈ పాటను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలనే రచించడం విశేషం. ఈ పాటను మోహన భోగరాజు, సాహితి చాగంటి, హర్షవర్దన్ చావలి కలిసి ఆలపించారు. నాగార్జున పంచెకట్టులో కనిపిస్తుండగా.. నాగ చైతన్య మోడ్రన్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇక ఫరియా మాత్రం ఆటంబాంబ్‌లో కనిపిస్తున్నారు.

ఈ పాట కచ్చితంగా పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా మారుతుంది. ఇది వరకే విడుదల చేసిన లడ్డుండా, నా కోసం పాటలకు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాట ఇప్పటికే యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇప్పటికే 2 మిలియన్ కు పైగా వ్యూస్ ను దక్కించుకొని దూసుకుపోతుంది ఈ పాట. ఇక అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.