AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudheer Babu : కొత్త సినిమా మొదలుపెట్టిన యంగ్ హీరో.. ప్రారంభమైన సుధీర్ బాబు నయా మూవీ..

ప్ర‌స్తుతం ప‌లు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ల‌తో మ‌న ముందుకు రాబోతున్నారు హీరో సుధీర్ బాబు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.

Sudheer Babu : కొత్త సినిమా మొదలుపెట్టిన యంగ్ హీరో.. ప్రారంభమైన సుధీర్ బాబు నయా మూవీ..
Sudheer Babu
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2021 | 7:18 PM

Share

Sudheer Babu : ప్ర‌స్తుతం ప‌లు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ల‌తో మ‌న ముందుకు రాబోతున్నారు హీరో సుధీర్ బాబు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.. ఇటీవలే శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు  తన కెరీర్‌లో 15వ చిత్రంగా హర్షవర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫ‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.5గా నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సుధీర్ బాబు కోసం ఒక భిన్న‌మైన క‌థ‌ను రెడీ చేశారు ద‌ర్శ‌కుడు హ‌ర్ష వ‌ర్ధ‌న్‌. ఈ సినిమాలో ఇంత వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవతారంలో సుధీర్ బాబు క‌నిపించ‌నున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు(సోమవారం) హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు షాట్‌కు నిర్మాత పుస్కుర్‌ రామ్‌మోహ‌న్ రావు క్లాప్ కొట్టి స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడికి అంద‌జేశారు. వ‌చ్చే వారం నుండి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇంకా పేరు పెట్ట‌ని ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల‌లో న‌టించ‌నున్నారని తెలుస్తుంది.  ఈ సినిమాకు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్ర‌ఫి భాధ్య‌తలు నిర్వ‌హిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్ట‌ర్. ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుప‌నున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa : బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్న ‘పుష్ప’ రాజ్.. రెండు రోజుల్లోనే సరికొత్త రికార్డ్..

AP Movie Tickets: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ జీవో రద్దు అన్నీ థియేటర్లకు వర్తిస్తుందన్న ఏజీ..

Year Ender 2021: ఈ ఏడాదిలో ఎక్కువగా శ్రోతల హృదయాలను గెలుచుకున్న సాంగ్స్ ఇవే..

Follow Us
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.13 వేలు!
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.13 వేలు!
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరో తెలుసా?
ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరో తెలుసా?
వెల్లుల్లి నిజంగానే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా..?
వెల్లుల్లి నిజంగానే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా..?
పదో తరగతి అర్హతతో ఇండియా పోస్ట్‌లో భారీగా ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి అర్హతతో ఇండియా పోస్ట్‌లో భారీగా ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
సిక్కింలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు మృతి
సిక్కింలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు మృతి
టెస్లా నుంచి చిన్నారుల కోసం 'బ్యాలెన్స్ బైక్'.. ప్రత్యేకతలివే
టెస్లా నుంచి చిన్నారుల కోసం 'బ్యాలెన్స్ బైక్'.. ప్రత్యేకతలివే
ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!
ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!
మారుతి సుజుకి నుంచి సరికొత్త 'బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్'.. ఎప్పుడంటే
మారుతి సుజుకి నుంచి సరికొత్త 'బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్'.. ఎప్పుడంటే
జానీ మాస్టర్ కు 'సహాయ నిరాకరణ' పనిష్మెంట్
జానీ మాస్టర్ కు 'సహాయ నిరాకరణ' పనిష్మెంట్