AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: గజరాజుకు కోపం వచ్చింది.. చిరుత గజగజ వణికిపోయింది.. ఏకంగా గంట పాటు

చిరుత పులిని చూస్తే ఏ జంతువైనా గజగజా వణకాల్సిందే.. ఎందుకంటే దాని కంటిలో పడ్డ జంతువు ఏదీ తప్పించుకోవడం అసాధ్యం.

Viral: గజరాజుకు కోపం వచ్చింది.. చిరుత గజగజ వణికిపోయింది.. ఏకంగా గంట పాటు
Elephant Chases Leopard
Ram Naramaneni
|

Updated on: Dec 22, 2021 | 4:55 PM

Share

చిరుత పులిని చూస్తే ఏ జంతువైనా గజగజా వణకాల్సిందే.. ఎందుకంటే దాని కంటిలో పడ్డ జంతువు ఏదైనా తప్పించుకోవడం అసాధ్యం. వేటాడటంలో చిరుతకు తిరుగులేదు. అలాంటి చిరుత ఓ ఏనుగును చూసి భయంతో వణికిపోయింది. వేట కోసం బయలు దేరిన ఒక చిరుత పులి ఏనుగుల గుంపు మీద దాడికి ప్రయత్నించింది. అయితే అందులో ఓ ఏనుగు చిరుతపులిపై తిరగబడింది. చిరుత పులిని తరిమి తరిమి కొట్టింది. దాంతో పరుగు లంకించుకున్న చిరుత.. ఈ ఏనుగు తనను వదిలా లేదనుకుంది. దాని నుంచి తప్పించుకోడానికి చెట్టు కనబడితే గబగబా చెట్టేక్కేసింది. హమ్మయ్య అనుకుంది..

కానీ ఏనుగు తగ్గేదే లే.. అన్నట్లు ఆ చిరుతను అక్కడితో వదల్లేదు. దాన్ని చెట్టుపై నుంచి ఎలాగైనా దింపాలనుకుంది. చెట్టును గట్టిగా ఊపింది.. తొండంతో మట్టిని తీసి చిరుతమీదకు విసిరే ప్రయత్నం చేసింది. అదంతా చూసిన చిరుత వామ్మో… ఈ ఏనుగుకి చెట్టెక్కడం రాదు కాబట్టి బతికిపోయా… లేదంటే అయిపోయేదాన్ని.. మళ్లీ దీంతో పెట్టుకోకూడదు అన్నట్టుగా ఆ చెట్టు రెండు కొమ్మల మధ్య కూర్చుని ఏనుగును చూస్తుంది. దక్షిణాఫ్రికాలోని నార్త్‌వెస్ట్‌ ప్రావిన్స్‌లో ఉన్న రిజర్వు పార్కులో ఈ సంఘటన జరిగింది. ఈ సన్నివేశాన్ని ఫొటోగ్రాఫర్‌ కెవిన్‌ డూలే క్లిక్‌మనిపించారు. చెట్టెక్కింది కదా అని ఈ ఏనుగు చిరుతను అంత ఈజీగా వదిలేయలేదట. దాదాపు గంటపాటు అక్కడే ఉండి.. రకరకాల విన్యాసాలతో చిరుతకు టెర్రర్ పుట్టించిదట. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Lepord

Also Read: Andhra Pradesh: మద్యం ధరలు తగ్గాయన్న ఆనందంలో మితిమీరి తాగాడు.. చివరకు

Follow Us
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు