Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మద్యం ధరలు తగ్గాయన్న ఆనందంలో మితిమీరి తాగాడు.. చివరకు

ఏపీ సర్కార్ ఇటీవల  మద్యం ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ మార్జిన్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది.

Andhra Pradesh: మద్యం ధరలు తగ్గాయన్న ఆనందంలో మితిమీరి తాగాడు.. చివరకు
Alcoholism
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 22, 2021 | 4:25 PM

ఏపీ సర్కార్ ఇటీవల  మద్యం ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ మార్జిన్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం తగ్గించింది. అన్ని కేటగిరిల మద్యంపై 20 శాతం వరకు ధరలను తగ్గించింది ప్రభుత్వం. దీంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. మద్యం దుకాణలకు దిష్టి తీసిన సీన్స్ ఇటీవల తారసపడ్డాయి.  అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం విట్లంపల్లి గ్రామానికి చెందిన కూలి రైతు గోవిందు కూడా మద్యం ప్రియుడు. రాష్ట్రంలో మద్యం ధరలు తెగ సంబరపడిపోయాడు. ఆ  ఆనందంలో  అతిగా మద్యం తాగాడు. తాగి తాగి చివరికి అపస్మారక స్థితిలోకి జారుకుని.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన గోవిందును అతని తల్లి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించింది. ట్రీట్మెంట్ చేశారు కానీ…అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు అనంతపురం తరలించారు. ఈ ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది.

గోవిందు రోజూ మద్యం తాగేవాడని… సర్కార్ మద్యం ధరలు తగ్గించడంతో గత రెండు రోజుల నుంచి కొంచెం అధికంగా మద్యం సేవించినట్లు బాధితుని తల్లి వెల్లడించింది. కాగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, నాటుసారా తయారీని అరికట్టేందుకు మద్యం ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Telangana: పరీక్షల్లో తప్పానన్న మనస్తాపంతో మరో ఇంటర్‌ విద్యార్థిని సూసైడ్

మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
షుగర్ పేషెంట్లకు మొక్కలతో తయారయ్యే చక్కెర.. దీని గురించి తెలుసా?
షుగర్ పేషెంట్లకు మొక్కలతో తయారయ్యే చక్కెర.. దీని గురించి తెలుసా?
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా..
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా..
దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!