Viral Photo: సినిమాలోని ఫోటో లేదా గ్రాఫిక్ చేశారు అనుకునేరు.. రియల్…
సోషల్ మీడియాలో రోజూ వైరల్ కంటెంట్ సర్కులేట్ అవుతుంది. ఇంటర్నెట్ వినియోగం పెరిగాక కాస్త ఇంట్రస్టింగ్ ఉండేది ఏదైనా క్షణాల్లో నెట్టింట ట్రెండ్ అవుతోంది.

సోషల్ మీడియాలో రోజూ వైరల్ కంటెంట్ సర్కులేట్ అవుతుంది. ఇంటర్నెట్ వినియోగం పెరిగాక కాస్త ఇంట్రస్టింగ్ ఉండేది ఏదైనా క్షణాల్లో నెట్టింట ట్రెండ్ అవుతోంది. అలానే ఓ ఫోటో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. స్పైడర్‌మ్యాన్‌లా కనిపించే అగామా బల్లిని వైరల్ ఫోటోలో చూడవచ్చు. ఈ బల్లి సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంటర్నెట్‌లో ఈ ఫోటోపై నెటిజన్స్ విభిన్న రకాల కామెంట్లు పెడుతున్నారు.
చిత్రాన్ని వీక్షించండి…
Spider-Man in real life…
DYN that the Mwanza flat-headed rock agama, referred to sometimes as Spider-Man agama, climbs up vertical walls like the reel life spider man?? pic.twitter.com/ydpZvFNUvY
— Susanta Nanda IFS (@susantananda3) December 21, 2021
స్పైడర్ మ్యాన్ లాగా కనిపించే బల్లిని మీలో చాలామంది అస్సలు చూసి ఉండరు. ప్రజంట్ అలాంటి బల్లి ఫోటో సోషల్ మీడియాలో మీ ముందుకు తీసుకొచ్చాం. అది స్పైడర్ మ్యాన్ లాగా కనిపిస్తుంది. సినిమాల్లో ఎరుపు, నీలం రంగుల్లో ఉండే స్పైడర్ మ్యాన్ డ్రెస్ ఎలా ఉంటుందో, అలాంటి రంగే ఈ బల్లి కూడా కలిగి ఉంది. ఈ బల్లి శరీరం సగం ఎరుపు రంగులో ఉంటుంది, మిగిలిన సగం నీలం రంగులో కనిపిస్తుంది. దాని ముందు కాళ్లు కూడా సగం ఎరుపు, సగం నీలం రంగులో ఉన్నాయి.
ఈ ఫొటోను ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీన్ని మ్వాన్జా ఫ్లాట్-హెడ్ రాక్ అగామా, స్పైడర్ మాన్ అగామా అని పిలుస్తారని వివరించారు.
Also Read: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్
నీటి సంపులో పడిపోయిన పిల్లి.. కాపాడేందుకు కోతి తాపత్రయం చూడండి