Dhanurmasa: నేడు 8వ పాశురం.. కన్నయ్య అనుగ్రహం కోసం అతనికి కంటే ముందుగా పూజకు చేరుకోవాలంటున్న గోదా..

Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు ఎనిమదవరోజు. ఈ పాశురాల్లో ఆరవ పాశురం నుంచి పది పాశురాల వరకూ గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే..

Dhanurmasa: నేడు 8వ పాశురం.. కన్నయ్య అనుగ్రహం కోసం అతనికి కంటే ముందుగా పూజకు చేరుకోవాలంటున్న గోదా..
Tiruppavai 8th Parushram
Surya Kala

|

Dec 23, 2021 | 8:04 AM

Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు ఎనిమదవరోజు. ఈ పాశురాల్లో ఆరవ పాశురం నుంచి పది పాశురాల వరకూ గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి.  ఒక్కొక్క రోజు ఒక్కొక్క‌ వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి. పక్షుల కిలకిలారావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. మంచు బిందువులు కురిసిన గడ్డిని తినేసిన ఆలమందలు నెమరువేసుకుంటూ ఉరకలు వేస్తూ ఊరు దాటి వెళుతున్నాయి. చీకట్లు తొలగి ఉదయభానుడు వచ్చేలోగానే యమునలో మూడు మునకలు వేసి మనం పూజకు సిద్ధం కావాలి. ఈలోగా ఆ చిన్ని కన్నయ్య ని కూడా లేపాలి. ఈ ధనుర్మాసం నెల రోజులూ విష్ణువుని స్తుతిస్తూ.. ప్రతి దినం గోదాదేవి రచించిన పాశురాలను వైష్ణవాలయాల్లో పాడతారు. ఈరోజు ధనుర్మాసంలో ఎనిమదవరోజు ..ఈరోజు  పాశుర‌ము, దాని అర్ధం తెలుసుకుందాం..

8వ పాశురము

కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు మేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్ పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ పావాయ్ ! ఎళున్దిరాయ్ పాడిప్పరైకొణ్డు మావాయ్ ! పిళన్దానై మల్లరై మాట్టియ దేవాదిదేవనై చ్చెన్రునామ్ శేవిత్తాల్ ఆవావెన్రా రాయ్ న్దరుళేలో రెమ్బావాయ్

అర్ధం: తూర్పు దిక్కున ఆకాశము తెల్లివారింది. గేదెలు మేత మేయటానికై విడవబడ్డాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు రావడానికి కంటే ముందుగానే అతని వద్దకు చేరాలని కోరుకుంటున్నారు.  అందరం కలిసి ఇష్టంగా కృష్ణుడి వద్దకు వెళ్లడం కోసం బయలుదేరాము.. వారందరినీ అక్కడ నిలిపి నీ కోసం నేను వచ్చాను.  నీకును  కృష్ణుడిని చేరుకోవాలని కుతూహలముగనే ఉంది కదా.. మరింక ఆలస్యమెందుకు? లే.. ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన ‘పఱై’ అనే సాధనమును పొందుదుము.. కృష్ణుడు కంటే ముందుగానే మనం అతని వద్దకు వెళ్ళితే.. సంతోషంగా మన కోరిక నెరవేరుస్తాడు.. రండి అంటూ మరో గోపిక ను గోదా దేవి నిద్ర లేపింది.

Also Read:  ఈ రాశి ఉద్యోగ, వ్యాపార విషయంలో శుభవార్త వింటారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu