RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!

RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!
Rrr Movie

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాలలో 'RRR' నిస్సందేహంగా ఒకటి.  జనవరి 7, 2022 న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ విడుదల కానుంది.

Ram Naramaneni

|

Dec 22, 2021 | 9:56 PM

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘RRR’ నిస్సందేహంగా ఒకటి.  జక్కన్న చెక్కిన ఈ చిత్రం  హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కోసం ఇటీవల ముంబైలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. కరణ్ జోహర్ హోస్ట్ చేసిన ఈ మెగా ఈవెంట్‌కి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. RRR జనవరి 7, 2022 న వరల్డ్ వైడ్‌గా విడుదలకు సిద్దమవుతుంది.  ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకుల కోసం ఇలాంటి పెద్ద ఈవెంట్‌ను నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Balayya Chiru

=

హైదరాబాద్‌లో జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి సమాచారం అందుతుంది. ఈ వార్తను అధికారికంగా మూవీ టీమ్ ధృవీకరించనప్పటికీ, ఫిల్మ్ సర్కిల్స్‌లో మాత్రం వార్త వినిపిస్తుంది. రాజమౌళి తన సినిమా ఈవెంట్‌ల విషయంలో ఎప్పుడూ ప్రత్యేకమైన ప్లాన్స్‌తో ఉంటారని తెలిసిన విషయమే. RRRలో మెగా, నందమూరి కుటుంబాలకు చెందిన స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు. దీంతో అభిమానులకు ఉత్సాహపరిచేందుకు ఆ కుటుంబాలకు చెందిన సీనియర్ హీరోలనే పిలవాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. తారక్‌కు జోడిగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, చరణ్‌కు జోడిగా అలియా భట్ నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రేయ, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటించారు.

Also Read: ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ హీరో.. ఎవరో గుర్తపట్టారా..?

నీటి సంపులో పడిపోయిన పిల్లి.. కాపాడేందుకు కోతి తాపత్రయం చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu