Tollywood Hero: ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ హీరో.. ఎవరో గుర్తపట్టారా..?

టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఓ యంగ్ హీరో చిన్నప్పటి ఫోటో ఒకటి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు అతడిని గుర్తించలేకపోతున్నారు.

Tollywood Hero: ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ హీరో.. ఎవరో గుర్తపట్టారా..?
Tollywood Hero
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 7:17 PM

అడవి శేష్..  సౌత్ ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. రైటర్ కూడా. అద్భుతమైన కథలతో అతడు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్నాడు. తన “కర్మ” , “కిస్” చిత్రాల దర్శకత్వం వహించాడు శేష్. కెరీర్ తొలినాళ్లతో సపోర్టింగ్ రోల్స్ చేసిన శేష్..  క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకున్నారు. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన ఎన్.ఎస్.జీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘మేజర్’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘హిట్’ కేస్ 2లో కూడా కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇటీవల డెంగ్యూ వ్యాధితో అనారోగ్యానికి లోనయ్యాడు శేష్. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఈ 36 ఏళ్ల హీరో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తనకు పెళ్లిపై గాలి మళ్లిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.

కాగా శేష్ పుట్టింది తెలుగునేలమీదే అయినా పెరిగింది మాత్రం అమెరికాలోని బర్క్ లీలో. అక్కడే విద్యాభ్యాసం సాగించాడు శేష్. అతని సమీపబంధువు సాయికిరణ్ అడివి కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు.  కాగా శేష్ చిన్నప్పటి ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. టీవీఎస్ మోపెడ్‌పై స్టైల్‌గా ఫోటోకు స్టిల్ ఇచ్చాడు లిటిల్ శేష్. చిన్నప్పుడే హీరో క్వాలిటీస్ కనిపిస్తున్నాయి అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Adivi Sesh

Also Read: ఈ ఫోటోలో ప్రమాదకర పాము దాగుంది.. కనిపెట్టండి చూద్దాం.. 

 నీటి సంపులో పడిపోయిన పిల్లి.. కాపాడేందుకు కోతి తాపత్రయం చూడండి