Gopichand: ఆ దర్శకుడితో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయిన మ్యాచో హీరో.. గోపిచంద్ 30వ సినిమా ఎవరితోనంటే..
మ్యాచో హీరో గోపీచంద్ చాల కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు.
Gopichand: మ్యాచో హీరో గోపీచంద్ చాల కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. రీసెంట్ గా సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమా చేశాడు ఈ టాల్ హీరో. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ లో తక్కువ టైం లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో మారుతి ఒకరు. నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు మారుతి. కామెడీనే ప్రధానాంశంగా మారుతి సినిమాలను తెరకెక్కిస్తూ అందుకుంటున్నాడు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, రీసెంట్ గా మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో కలిసి ప్రతి రోజు పండగే అనే సినిమా చేసాడు. ఇప్పుడు గోపీచంద్ తో పక్క కమర్షియల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ హ్యాండ్సమ్ హీరో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడని తెలుస్తుంది. గోపీచంద్ శ్రీవాస్ దర్శకత్వం ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి చేసిన ‘లక్ష్యం’ .. ‘లౌక్యం’ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరలోనే హీరోయిన్ ఎవరు అనే దానికి క్లారిటీ ఇవ్వనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి