RBI: జనవరి 1 నుంచి ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ అమలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

RBI: ఆన్‌లైన్ కార్డ్ లావాదేవీలకు సంబంధించి ఆర్‌బిఐ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. ఈ నిబంధనల ప్రకారం..

RBI: జనవరి 1 నుంచి ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ అమలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Dec 23, 2021 | 7:04 AM

RBI: ఆన్‌లైన్ కార్డ్ లావాదేవీలకు సంబంధించి ఆర్‌బిఐ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. ఈ నిబంధనల ప్రకారం.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు లేదా జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ డెలివరీ కంపెనీలు వినియోగదారుల కార్డ్ సమాచారాన్ని సేవ్ చేయలేరు. ఏదైనా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో కస్టమర్లు ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించినప్పుడు వారి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

ఇలా చేయడం వల్ల ఒక్కోసారి వారు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అలా జరగకుండా ఉండేందుకు ఆర్బీఐ ఈ కొత్త రూల్స్‌ ప్రవేశపెట్టింది. కస్టమర్ల భద్రతను పెంచడం కోసం, కార్డ్ వివరాలను సేవ్ చేయకుండా వ్యాపారులను నియంత్రించేందుకు RBI మార్చి 2020లో ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. అంతేకాకుండా ఈ ఏడాది సెప్టెంబర్‌లో భద్రతను మెరుగుపరచడానికి RBI కార్డ్ టోకనైజేషన్ సేవలపై నిబంధనలను మెరుగుపరిచింది. కస్టమర్ అనుమతి ద్వారానే కార్డ్ డేటా టోకనైజేషన్ జరుగుతుందని RBI వివరించింది.

కస్టమర్లు తప్పక తెలుసుకోవలసిన విషయాలు 1. జనవరి 1, 2022 నుంచి కస్టమర్‌లు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలను ఏదైనా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో సేవ్ చేయలేరు. 2. ఆన్‌లైన్ లావాదేవీ చేసిన ప్రతిసారీ కార్డు వివరాలను మళ్లీ నమోదు చేయాల్సి ఉంటుంది. 3. కస్టమర్లు తమ కార్డులను “టోకనైజ్” చేయడానికి ఈ-కామర్స్ కంపెనీలకు తమ అనుమతిని తెలియజేయాలి. తర్వాత ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అవసరమైన విధంగా అదనపు ఫ్యాక్టర్ అథెంటికేషన్‌తో వివరాలను ఎన్‌క్రిప్ట్ చేయమని కార్డ్ నెట్‌వర్క్‌ని అడుగుతుంది. 4. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఎన్‌క్రిప్టెడ్ వివరాలను స్వీకరించిన తర్వాత కస్టమర్‌లు ఆ కార్డ్‌ని భవిష్యత్ లావాదేవీల కోసం సేవ్ చేసుకోవచ్చు. 5. ప్రస్తుతం మాస్టర్ కార్డ్, వీసా అందించిన కార్డ్‌లు మాత్రమే టోకనైజ్ చేయబడతాయి. 6. RBI తన తాజా మార్గదర్శకాలలో క్రెడిట్, డెబిట్ కార్డులు రెండింటికీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. 7. కొత్త మార్గదర్శకాలు అంతర్జాతీయ లావాదేవీలకు వర్తించవని, దేశీయ కార్డులు, లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయని ఆర్‌బిఐ పేర్కొంది. 8. కార్డ్‌ల టోకనైజేషన్ కోసం ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. 9. అంతేకాకుండా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు టోకనైజ్డ్ కార్డ్‌ల చివరి నాలుగు అంకెలను కస్టమర్‌లు సులభంగా గుర్తించడానికి చూపుతాయని RBI తెలిపింది. 10. అయితే అన్ని లావాదేవీలకు కార్డుల టోకనైజేషన్ తప్పనిసరి కాదు.

ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌.. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే జీతం.. లేదంటే అంతే సంగతులు..

PM Kisan: రైతులకు శుభవార్త.. కొత్త సంవత్సరం రోజున పీఎం కిసాన్ పదో విడత డబ్బులు..

సంచలన నిర్ణయం.. జనవరి 1 నుంచి వ్యాక్సిన్‌ వేసుకోని వ్యక్తులు అక్కడ తిరగడం నిషేధం..