KTR: అగ్నిపథ్‌ ఆగ్రహ జ్వాలలపై స్పందించిన కేటీఆర్‌.. కేంద్రానికి కనువిప్పు కలగాలంటూ..

Agnipath Protest News: సైన్యంలో నియామాకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన  అగ్నిపథ్ స్కీమ్‌(Agnipath Scheme)ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

KTR: అగ్నిపథ్‌ ఆగ్రహ జ్వాలలపై స్పందించిన కేటీఆర్‌.. కేంద్రానికి కనువిప్పు కలగాలంటూ..
Agnipath Protest News
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jun 17, 2022 | 3:51 PM

Agnipath Protest News: సైన్యంలో నియామాకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన  అగ్నిపథ్ స్కీమ్‌(Agnipath Scheme)ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. రైళ్లకు నిప్పుపెట్టారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమాలు తాజాగా సికింద్రాబాద్‌కు పాకాయి. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా స్టేషన్‌లోని పలు రైళ్లకు ఆందోళన కారులు నిప్పుపెట్టారు. ఈ ఆందోళనల్లో ఒకరు మృతిచెందినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (KTR) అగ్నిపథ్‌ ఆందోళనలపై స్పందించారు.

‘అగ్నిపథ్‌ ఆందోళన కేంద్రానికి కనువిప్పు కావాలి. దేశంలో నిరుద్యోగ సమస్య ఎలా ఉందో వీటిని చూస్తే స్పష్టమవుతుంది. ఇంతకు ముందు రైతుల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడు జవాన్లతో ఆడుకుంటున్నారు. మొదట వన్‌ ర్యాంక్‌- వన్‌ పెన్షన్‌ అన్నారు. ఇప్పుడు నో ర్యాంక్‌-నో పెన్షన్‌ అంటున్నారు’ అంటూ ట్విట్టర్‌ వేదికగా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్‌. కాగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసం కొనసాగుతోంది. రైలు పట్టాలపై పార్సిళ్లు, ఫర్నిచర్స్‌ను ధ్వంసం చేశారు. అలాగే రైలు బోగీలను సైతం ధ్వంసం చేశారు. మరోవైపు ఆందోళన కారులను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..