JC Prabhakar Reddy: జేసి నివాసంలో ఈడీ అధికారులు దాడులు.. సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అధికారులు జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసంలో దాడులు చేశారు. తనిఖీల సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై ఏకకాలంలో వివిధ ప్రాంతాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. అనంతపురంజిల్లాలోని తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్‌రెడ్డి స్వగృహంలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అధికారులు జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసంలో దాడులు చేశారు. తనిఖీల సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈడీ ఎవరినీ లోపలికి రానీయకుండా సోదాలు నిర్వహిస్తున్నారు.
తాడిపత్రిలోని కాంట్రాక్టర్ గోపాల్‌రెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను మొత్తం 20 మంది సిబ్బంది పరిశీలిస్తున్నారు.భారీ బందోబస్తు నడుమ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి ఆస్తుల వివరాలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రపదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..