Tirumala: పేదవారికి అండగా కళ్యాణమస్తు.. సామూహిక వివాహాలకు ముహర్తం ఫిక్స్.. ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..
పేదవారికి అండగా వుండడానికి కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. అర్హులైన పేదవారు జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు.
TTD Kalyanamasthu: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో జరిగే కళ్యాణమస్తుకు ముహూర్తం ఖరార చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఆగస్టు 7న ఉదయం 8:07 నిముషాల నుంచి 8:15 నిమిషాల మధ్య వివాహ సమయంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని(Andhrapradesh) 26 జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. పేదవారికి అండగా వుండడానికి కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నామని చెప్పారు ధర్మారెడ్డి. అర్హులైన పేదవారు జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు.
కళ్యాణమస్తులో వివాహం చేసుకోవాలనుకునే జంటలు.. జులై 21 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనని చెప్పారు. ఈ కళ్యాణమస్తులో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యే జంటలకు టీటీడీ నుంచి పెళ్లి బట్టలు, బంగారు పుస్తెలు అందచేయడం జరుగుతుంది. అంతేకాదు కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించే కేంద్రాల్లో భోజన సదుపాయం కూడా ఉంటుంది. ఎవరైతే వివాహాలకు ఖర్చు భరించలేరో అలాంటి వారికి స్వామివారి ఆశీస్సులతో జరిపిస్తున్నామని తెలిపారు ధర్మారెడ్డి. ప్రస్తుతం ఏపీలోనే కళ్యాణమస్తు నిర్వహిస్తున్నామని.. ఇతర రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆయా రాష్ట్ర సీఎంలు ముందుకు వస్తే, ఆ ప్రాంతాల్లో కూడా టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…