Tirupati: పునర్వైభవం దిశగా శ్రీవారి తల్లి వకుళామాత ఆలయం.. రేపటి నుంచి 23 వరకూ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు
గత కొన్ని సంవత్సరాలకు ముందు వకుళామాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతనే శ్రీవారికి నైవేథ్యం పెట్టేవారని ప్రసిద్థి. శిధిలావస్థలో ఉన్న దేవాలయం స్థానంలో ఇప్పుడు వకుళమాత ఆలయాన్ని నిర్మించారు.
Tirupati: యశోదాదేవి కలియుగంలో వకుళామాతలా మారి స్వామివారి ఆలనాపాలనా చూసిన వకుళామాత పద్మావతి దేవిని ఇచ్చి స్వయంగా వివాహం చేసింది. తన కోరికను నెరవేర్చుకుంది. శ్రీవారి తల్లిగా పూజలను అందుకున్న వకుళాదేవి ఆలయం తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉంది. గత కొన్ని సంవత్సరాలకు ముందు వకుళామాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతనే శ్రీవారికి నైవేథ్యం పెట్టేవారని ప్రసిద్థి. శిధిలావస్థలో ఉన్న దేవాలయం స్థానంలో ఇప్పుడు వకుళమాత ఆలయాన్ని నిర్మించారు. ఈ నూతన వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 18 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 23వ తేదీన ఉదయం 7.30 నుండి 8.45 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
జూన్ 18వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు శోభాయాత్ర, రాత్రి 7.30 గంటలకు పుణ్యాహవచనం, ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
జూన్ 19న ఉదయం 6.30 నుండి 11 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అకల్మషహోమం, అక్షిమోచనం, పంచగవ్యాధివాసం చేపడతారు. సాయంత్రం 6.30 గంటలకు అగ్నిప్రతిష్ట, కలశస్థాపన, కుంభావాహనం, కుంభారాధన, ఉక్త హోమాలు నిర్వహిస్తారు.
జూన్ 20న ఉదయం 8.30 గంటలకు కుంభారాధన, ఉక్త హోమాలు, నవ కలశ స్నపన క్షీరాధివాసం, సాయంత్రం 6.30 గంటలకు హోమాలు, యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు.
జూన్ 21న ఉదయం 8.30 గంటలకు పుణ్యాహవచనం, కుంభారాధన, చతుర్ధశ కలశ స్నపన జలాధివాసం, సాయంత్రం 6.30 గంటల నుండి హోమం, యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జూన్ 22న ఉదయం 8 గంటలకు రత్నధాతు అధివాసం, కుంభారాధన, హోమాలు, ఉదయం 10.45 నుండి 11.30 గంటల వరకు విమాన కలశ స్థాపన, గోపుర కలశ స్థాపన, రత్నన్యాసం, ధాతున్యాసం, విగ్రహ స్థాపన, మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు మహాశాంతి తిరుమంజనం, రాత్రి 8 గంటలకు కుంభారాధనం, నివేదన, శయనాధివాసం, విశేష హోమాలు, యాగశాల కార్యక్రమాలు చేపడతారు.
జూన్ 23న ఉదయం 4.30 నుండి 7 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, విమాన గోపుర కలశ ఆవాహన, ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు మిథున లగ్నంలో ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తరువాత అక్షతారోహణం, అర్చక బహుమానం అందిస్తారు. ఉదయం 10.20 గంటలకు ధ్వజారోహణం, ఉదయం 10.30 నుండి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శాంతి కల్యాణోత్సవం జరుగనుంది. అనంతరం ధ్వజావరోహణం చేపడతారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనం కల్పిస్తారు.
పేరూరు కొండపై ఉన్న వకుళామాత ఆలయంలోని పెద్ద గంట కొడితే తిరుమల గిరులపై ఆ గంట వినబడేది. అలా ఎంతో చారిత్రక కట్టడం వకుళామాత ఆలయం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..