Telangana: సామాన్యుడికి నార్కోటిక్ పోలీసుల బంపరాఫర్‌.. ఆ సమాచారం ఇస్తే ఏకంగా రూ.2 లక్షల రివార్డు

తెలంగాణలో భారీగా డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 1892 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ వినియోగించిన వారిని దాదాపు 3,792 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి రూ.179.3 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 679 గంజాయి కేసులు నమోదవగా.. 42 వేల కిలోల గంజాయి స్వాధీనం..

Telangana: సామాన్యుడికి నార్కోటిక్ పోలీసుల బంపరాఫర్‌.. ఆ సమాచారం ఇస్తే ఏకంగా రూ.2 లక్షల రివార్డు
Telangana Anti Narcotics Bureau
Follow us

|

Updated on: Jul 02, 2024 | 1:59 PM

హైదరాబాద్‌, జులై 2: తెలంగాణలో భారీగా డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 1892 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ వినియోగించిన వారిని దాదాపు 3,792 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి రూ.179.3 కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 679 గంజాయి కేసులు నమోదవగా.. 42 వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రూ.102.41 కోట్లు విలువ చేసే గంజాయిని అధికారులు ధ్వంసం చేశారు.

డ్రగ్స్‌ కేసులతో పాటు భారీగా సైబర్‌ కేసులు కూడా రాష్ట్రంలో నమోదయ్యాయి. తెలంగాణలో గత 6 నెలల వ్యవధిలో 2.52 లక్షల సైబర్ ఫిర్యాదులు అందినట్లు సైబర్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. 6 నెలల్లో రూ. 262 కోట్ల డబ్బును మోసగాళ్ల నుంచి సైబర్ సెక్యూరిటీ పోలీసులు కాపాడారు. ఈ డబ్బును పోగొట్టుకున్న మొత్తం 5,191 మంది బాధితులకు పోలీసులు డబ్బును తిరిగి ఇప్పించారు. రూ.31.83 కోట్లు రీఫండ్‌ చేశారు.

దీనిలో భాగంగా ఇప్పటి వరకు 1, 57,256 బ్యాంక్ ఖాతాలు అధికారులు ఫ్రీజ్ చేశారు. గత 6 నెలల్లో 36,749 సిమ్ కార్డ్‌లను పోలీసులు బ్లాక్ చేశారు. 3,457 నకిలీ యాప్ , ఫైల్స్ బ్లాక్ చేశారు. ఈ మేరకు డ్రగ్స్‌, సైబర్‌ నేరాల వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో నార్కోటిక్ పోలీసులు సామాన్యుడికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. గంజాయి పై సమాచారం ఇచ్చిన వారికి భారీగా రివార్డ్ ప్రకటించారు. 100 కిలోలు కంటే ఎక్కువ గంజాయి అక్రమ రవాణా గురించి సమాచారం ఇస్తే ఏకంగా రూ. 2 లక్షల వరకు రివార్డ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. డ్రగ్స్ , గంజాయిపై ఫిర్యాదు చేసేందుకు 8712671111 ఫోన్‌ నంబర్‌కు కాల్ చేయవచ్చని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.